నేడు వై.ఎస్.ఆర్ జయంతి

నేడు వై.ఎస్.ఆర్ జయంతి - Sakshi


అక్షరమాల

 

ప్రతి హృదయం రాజన్న స్మృతివనం.

ఆ వనంలోని కొన్ని  జ్ఞాపకాల పరిమళాలివి...

 

(సాక్షి ఫ్యామిలీలో స్మృతి కథలుగా ప్రచురితమైన

 పాఠకుల అనుభవాల, అనుభూతుల నిలువెత్తు ప్రతిరూపం)

 

చిరునవ్వుల రేడు మా కలల చంద్రుడు

పేరుపెట్టి పిలిచే ఆప్యాయత సున్నిత హృదయుడు

ఆయనో వ్యక్తిత్వ వికాస పాఠం యువతరానికి స్ఫూర్తిప్రదాత

ఓటమే ఆయనకు భయపడేది తాతయ్యా అని పిలవమన్నారు

మృదువుగా హెచ్చరించేవారు

కలిసి నడిచాను భుజం తట్టి భేష్ అన్నారు

నాడి తెలిసిన నాయకుడు

అపాయింట్‌మెంట్ ఉందికానీ... ఆయన లేరు!

లేదనకుండా, కాదనకుండా ఇవ్వడమే ఆయనకు తెలిసింది

విసుగు ప్రదర్శించని వ్యక్తిత్వం మాటకు కట్టుబడే మారాజు

రైతులు రుణపడ్డ నేత

నిజమైన విజన్ ఉన్న నేత దేవుడా మళ్లీ పుట్టించు

రాజన్న ఉన్నంత కాలం వైకల్యం గుర్తుకు రాలేదు

అన్నదాతలకు అండ

గుర్తుగా గులాబీ మొక్కను నాటుకున్నాం రంజాన్‌కు కానుకలు ఇచ్చారు

ఇంటికి వెళ్లేవాళ్లం మా ఇంటికి మూడు తరాల నాయకుడు

గాడ్ బ్లెస్ యు అని దీవించాడు చదువే మన ఆస్తి అని చెప్పారు    

నిలువెత్తు తెలుగు సంతకం

బిజీగా ఉన్నా నా కోసం ఆగారు నేనిచ్చిన పువ్వును స్వీకరించారు

మా అమ్మగారి ప్రాణం నిలబెట్టారు

పేదల సంక్షేమంపైనే నిత్యం ఆయన ధ్యాస ఏటా కేక్ పంపించేవారు

అంత భరోసా ఎవరివ్వగలరు?

ప్రజలకోసం పరుగులెత్తించేవారు

మహోజ్వలమైన వెలుగు

మమ్మల్ని మెచ్చుకుంటూ ఉత్తరం రాశారు

నో అనడం తెలియని నాయకుడు

మడమ తిప్పని మనిషి

హలో ప్రొఫెసర్ హౌఆర్‌యూ  అనేవారు

కంటతడి పెట్టినప్పుడు నన్ను ఓదార్చారు

అవసరం తెలుసుకుని ఆదరించేవారు

స్వచ్ఛమైన స్ఫటికం

తాటాకు గొడుగు చేయించాను

బాణాన్ని ఒడుపుగా సంధించారు

ఆయన రాసిన ఉత్తరాన్ని దాచుకున్నాం

మంచి లీడర్‌ని పోగొట్టుకున్నాం

అసాధారణ మేధస్సు ఎ ఫిలాసఫర్ ఎ కింగ్



ఓ తల్లి అంతరంగం

నీ పుట్టిన రోజని...

పటానికి పూలు అల్లుతూ  కూర్చున్నా సామీ!

ఒక్కో పువ్వుకు ఒక్కో జ్ఞాపకం గుబాళిస్తోంది.

ఒక్కో జ్ఞాపకానికి మళ్లీ ఒక్కో పువ్వు పూస్తోంది!

నాటివన్నీ సంతోషాల వసంతాలు.

గ్రీష్మంలోనూ... గొంతు తడిపిన వర్షరుతువులు.

అభయాల జల్లులు.

ఆనందాల హరివిల్లులు.

రాముడే పాలించాడా?!

దేవుడే పాలించాడా?!

రాముడు, దేవుడు కలిసి...

నీ వంటి మానవుడిలో నివసించారా?!

అండగా ఉన్నావు.

అన్నీ నువ్వై నడిపించావు.

గుండెనిండా ఉన్నావు.

అనుక్షణ స్పందన అయ్యావు.

నువ్వు నాటిన మొక్కలు

వృక్షాలై నీడనిస్తున్నాయి.

నువ్వు తవ్విన నీళ్లు

సెలయేళ్లయి సేద తీరుస్తున్నాయి.

నువ్వు పెట్టిన అక్షర భిక్ష అక్షయపాత్రయి ఆదుకుంది.

నువ్వు నడిచిన నేల

సిరులను పండించింది.

నువ్వు ఇచ్చిన మాట

తిరుగులేని బాణం అయింది.

తొలిసంజె వేళల్లో... తలపులు నీవే.

మలిసంజె దీపాల్లో...

చిరునవ్వులు నీవే.

నీ మహోన్నత వ్యక్తిత్వం... వరం.

నీ సమున్నత ఆదర్శం... వారసత్వం.

ఇవాళ మళ్లీ దీపం పెడుతున్నాను.

ఇవాళ మళ్లీ దండం పెడుతున్నాను.

దీపం పెట్టి, దండం పెట్టి...

దండను వేస్తున్నాను.

ఆడపడుచుగా మళ్లీ మళ్లీ

నీవంటి అండనే కోరుకుంటున్నాను.

 

The beautiful world we know

మనకు తెలిసిన అందమైన లోకం

 

We know a world where dusk is awakened by dawn

సాయంసంధ్యలను మేల్కొలిపే తొలిపొద్దుల లోకం మనకు తెలుసు

We know a world where a draught is admonished by sky-nectar

కరువును బాపిన గగనామృతధారల లోకం మనకు తెలుసు

We know a world where autumn is surprised by spring

శిశిరాలను అబ్బురపరచిన వసంతాల లోకం మనకు తెలుసు

We know a world where hunger is addressed by sharing

అరిచే పేగులకు అన్నం పంచి ఆకలితీర్చిన లోకం మనకు తెలుసు

We know a world where sickness is appeased by caring

అస్వస్థతకు సాంత్వన చేకూర్చిన లోకం మనకు తెలుసు

We know a world where poverty is swept by giving

పెద్ద మనసుతో పేదరికాన్ని తుడిచేసిన లోకం మనకు తెలుసు

We know a world where illiteracy is answered in letter and spirit

అక్షరాలా... నిరక్షరాస్యతను నిర్మూలించిన లోకం మనకు తెలుసు

We know a world where discrimination is questioned with love

వివక్షను ప్రేమతో ప్రశ్నించిన లోకం మనకు తెలుసు

We know a world where a withering is replaced by a sprout

మోళ్లు చిగురించిన లోకం మనకు తెలుసు

We know a world where an untold loss is filled with the same blood

అవ్యక్త శూన్యాన్ని అదే నెత్తురు భర్తీ చేసిన లోకం మనకు తెలుసు

We know a world where a goodbye is revisited with an embrace

వీడ్కోలుకు ఆలింగనంతో పునఃస్వాగతం పలికిన లోకం మనకు తెలుసు

We know a world where a birthday has become universally ousehold

పుట్టినరోజు ఇంటింటి పండగైన లోకం మనకు తెలుసు

 * * *

A beautiful world of a garden with flowers tossing like memories

తలపుల తలలూపుతున్న పూదోటల లోకమది

A beautiful world of dreams… waiting to be realized

కలల సాకారానికి ఎదురుచూపులు చూస్తున్న అందమైన లోకమది

 

చెరగని సంతకం మాట తప్పకపోవడం ఒక సంతకం.

మడమ తిప్పకపోవడం ఒక సంతకం.

కోట్లమంది జీవితాలను మార్చిన జీవితమే...

ఒక సంతకం. జన్మ రుణం తీర్చుకున్న... సంతకం.

 

 

 తెలుగువారి గుండెచప్పుడు..

 రామరాజ్యం ఎలా ఉండేదో పురాణాల్లోనే చదువుకున్నాం

 రాజన్న రాజ్యాన్ని మాత్రం కళ్లారా చూశాం..

 ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అంటే అబ్బురపాటుతో విన్నాం

 రాజన్న రూపంలోనే రాముడిని చూసుకున్నాం..

 

 సంక్షేమ రాజ్యాన్ని రాజ్యాంగ పాఠాల్లో చదువుకున్నాం

 రాజన్న పాలనలో దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం..

 దివినున్న గంగను భువి మీదకు తెచ్చిన భగీరథుడిని చూడలేదు గానీ,

 రాజన్న జలయజ్ఞ దీక్షాదక్షతను ప్రత్యక్షంగా చూశాం.

 * * *

 రాముడు అడవులకు వెళ్లినప్పుడు

 జనాలంతా కంటతడి పెట్టుకొని బెంగటిల్లిపోయారట..

 పద్నాలుగేళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు పండగ చేసుకున్నారట..

 

 రాజన్న పాలన లేని రాష్ట్రంలో మాకూ బెంగగానే ఉంది..

 అరణ్యవాసానికీ ముగింపు ఉన్న విషయం గుర్తుకొచ్చి

 ధైర్యాన్ని కూడదీసుకుంటున్నాం.

 * * *

 రామరాజ్యం కలలోనైనా వస్తుందో, లేదో తెలియదు గానీ,

 రాజన్న రాజ్యం తిరిగి వస్తుందన్న నమ్మకం మాది..

 ఎవరు కాదన్నా, బలమైన మా ఆకాంక్షే మా నమ్మకానికి పునాది.

 

 

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top