ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌


సయ్యా తేరా.. ట్రిప్పీ ట్రిప్పీ

ట్రిప్పీ ట్రిప్పీ సాంగ్‌ : సన్నీ లియోన్‌

నిడివి: 3 ని.హిట్స్‌ 79,25,270


బాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘భూమి’ చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌ అయింది. నేహా కక్కర్, బెన్ని దయాళ్, బ్రిజేష్‌ శాండిల్య, బాద్షా.. అంతా కలసి ఈ గుంపు పాటను పాడారు. సచిన్‌–జిగార్‌ పాటను రాశారు. ఈ నీరసమైన వివరాలకేం గానీ.. పాటలోని ఒక మహత్తరమైన సంగతి ఏంటంటే.. సన్నీ లియోన్‌ ఈ ఐటమ్‌ సాంగ్‌కి స్టెప్పులేసి.. ఉప్పూకారం యాడ్‌ చేశారు. ఇకనేం.. హిట్స్‌లు యూట్యూబ్‌ నషాళానికి అంటేశాయి! ‘సయ్యా తేరా ట్రిప్పీ ట్రిప్పీ.. హిక్కీ హిక్కీ హిక్కీ హిక్కీ’ అంటూ ఒకలాటి గమ్మత్తు రిథమ్‌లో లియోన్‌ తన ఒంటిపై ప్రణయ గాయాలను చూపెడుతూ, ‘నీ లవర్‌ నన్ను చంపేశాడు’ అని కంప్లైంట్‌ చేస్తుంటుంది.



బృందగానంలోని ఓ వ్యసన ప్రేమికులు ఆమెకు జోడీగా.. నువ్వు నా తుపాకీ.. ఓ బేబీ, నువ్వు నా మురికి ఆలోచన. హాట్‌గా ఉన్నావు. చెప్పు నన్నేం చేయమంటావ్‌.. అని ఒక చెయ్యి చెవికి ఆన్చి, ఇంకో చేతిని సాగదీసి అడుగుతుంటారు. ఇక్కడితో స్టాప్‌ చేద్దాం. అన్నీ చెప్పేస్తే, ఇక మేం చూడ్డానికి ఏముంటుంది అనే కదా మీరు అనేయబోతున్నారు. సినిమా సెప్టెంబర్‌ 22న విడుదల అవుతోంది. సినిమా మొత్తం సన్నీ లియోన్‌ని చూసేయాలన్న ఆశ ఉంటే దాన్ని తక్షణం వదులుకోండి. ఆమె ఈ ఒక్క ఐటమ్‌సాంగ్‌లో మాత్రమే మీకు సాక్షాత్కరించి అదృశ్యమైపోతారు. మిగతా మూవీ అంతా సంజయ్‌దత్‌దీ, అదితి రామ్‌ హైదరీదీ. ఒకే దెన్‌. మరి ఈ ట్రిప్పీ ఏంటి? హిక్కీ ఏంటి? ట్రిప్పీ అంటే డ్రగ్‌ ఎఫెక్ట్‌తో వచ్చే తల తిరుగుడు భ్రాంతి. హిక్కీ అంటే ‘లైవ్‌ బైట్‌’.  



అయ్య బాబోయ్‌ అంత పని చెయ్యకు

బాద్షాహో : సోచా హై సాంగ్‌


నిడివి:2 ని. 16 సె.

హిట్స్‌ :62,70,330


ఎమర్జెన్సీ కాలం నాటి కథాంశంతో వస్తున్న బాలీవుడ్‌ థ్రిల్లర్‌ ‘బద్షాహో’ చిత్రంలోని ఓ ఛిల్లింగ్‌ సాంగ్‌ ‘సోచా హై యే కే తుమ్హే రాస్తా భులాయే’. ఇది ఇంత ఛిల్లింగ్‌గా ఎందుకు ఉందంటే ఈ పాటలో ఎమ్రాన్‌ హష్మీ ఉన్నాడు. అతడితో పాటు ఈషా గుప్తా! బాద్షాహో అంటే ‘కింగ్స్‌’ అని అర్థం. మూవీలోని మూడో పాటగా టీసీరీస్‌ ఈ ‘సోచా హై’ని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ చేసింది. వెరీ మచ్‌ రొమాంటిక్‌. 1975 నాటి ‘దీవార్‌’ చిత్రంలోని ‘కే దూన్‌ తుమ్హే’ పాటకు ఇది రీమిక్స్‌. అప్పటి ఆర్డీ బర్మన్‌ మ్యూజిక్‌ని ఇప్పుడు తనిష్క్‌ బాగ్చీ ‘న్యూమిక్స్‌’ని అందించాడు. ‘నిన్ను దారి మర్చిపోయేలా చేయాలని నిర్ణయించుకున్నాను. ఒక ఎడాది ప్రాంతంలో నిన్ను వదిలిపెట్టి భయపెడతాను’ అంటాడు హీరో అలంకరించిన పల్లకి లాంటి ఓ మోడ్రన్‌ త్రీ–వీలర్‌ వాహనంలో విహారానికి తీసుకెళుతూ. ‘అయ్య బాబోయ్‌.. అంత పని చెయ్యకు’ అని హీరోయిన్‌ వేడుకుంటుంది. ఇక పాటంతా రోడ్డు మీదే ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఈ సినిమాలో అజయ్‌దేవగణ్, ఇలియానా కూడా ఉన్నారు. సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ అవుతోంది. డైరెక్షన్‌ మిలాన్‌ లూథ్రియా. ఎవరీయన? ‘వన్స్‌ అప్‌ ఆన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై’ చిత్రం గుర్తుందా?



రాజ్‌కుమార్‌ రావ్‌ చంద్ర బోస్‌

బోస్‌ : డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌

నిడివి:2 ని. 12 సె.

హిట్స్‌ :15, 80,134


సుభాస్‌ చంద్రబోస్‌! ఓ లెజెంట్‌. ఓ మిస్టరీ. ఆయన చనిపోయాడా? బతికే ఉన్నాడా? ఏళ్లుగా అంతుచిక్కని ప్రశ్న. ప్రభుత్వాలు కమిటీలు వేశాయి. బోస్‌ అభిమానులు అన్వేషణ సాగించారు. ఏదీ తేల్లేదు. ఈ మధ్యే భారత ప్రభుత్వం.. బోస్‌ విమాన ప్రమాదంలో 1945 ఆగస్టు లోనే చనిపోయాడని అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రకటన మీదా అనుమానాలున్నాయి. ఇప్పుడు బోస్‌ మిస్టీరియస్‌ డెత్‌ మీద ఏక్‌తా కపూర్‌ వెబ్‌ సీరీస్‌ వస్తోంది. ‘బోస్‌: డెడ్‌ ఆర్‌ ఎలైవ్‌’ ఆ వెబ్‌ సీరిస్‌ పేరు. అందులో బోస్‌గా బాలీవుడ్‌ అప్‌కమింగ్‌ హీరో రాజ్‌కుమార్‌ రావ్‌ నటిస్తున్నాడు. ట్రైలర్‌లో అతడిని చూడగానే బోస్‌లా భలే సెట్‌ అయ్యాడు అనిపిస్తుంది. అయితే వెబ్‌లో ఇది ఎప్పుడు మొదలయ్యేదీ ఇంకా తేదీ ఖరారు కాలేదు. టెలీఫిల్మ్‌ చందాదారులకు వారి కోరికపై వీడియోలను ప్రదర్శిస్తుండే సంస్థ ఎ.ఎల్‌.టి. బాలాజీ  ‘బోస్‌’ను నిర్మిస్తోంది.



జీవిత సత్యాల జోల పాట

మైలీ సరస్‌ – యంగర్‌ నౌ


నిడివి :4 ని. 2 సె.

హిట్స్‌ :90,46,625


మైలీ సైరస్‌ కొత్త సింగిల్‌ వీడియో ట్రాక్‌ ‘యంగర్‌ నౌ’ విడుదలైంది. ఈ ఇరవై నాలుగేళ్ల అమెరికన్‌ సింగర్‌కు రోజురోజుకూ వయసు తగ్గినట్లుగా అనిపిస్తోందట! నిద్ర లేస్తూనే, పడక మీద అలా పడుకునే ఉండి.. ‘ఫీల్స్‌ లైక్‌ ఐ జస్ట్‌ వోక్‌ అప్‌. లైక్‌ ఆల్‌ దిస్‌ టైమ్‌ ఐ హ్యావ్‌ బీన్‌ అస్లీప్‌..’ అంటూ పాడ్డం మొదలుపెడుతుంది. ‘నిద్రపోతున్నంత సేపూ ఇప్పుడే లేచిన అనుభూతిని పొందుతున్నాను’ అనే మాట అనాలంటే.. పెద్ద జీవితాన్నే చూసి ఉండాలి. ఈ వయసులో ఈ పిల్లకేమిటి ఇంత ఫిలాసఫీ?! ఇంకా ఏమంటోందో వినండి. ‘నేనెవరో నాకు తెలియకపోయినప్పటికీ, ఒకప్పుడు నేనేమిటన్న దాని గురించి నాకు భయం లేదు’ అంటోంది. ‘ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉండిపోరు. అయినప్పటికీ ఐ ఫీల్‌ మచ్‌ యంగర్‌ నౌ’ అని కూడా. ఎలా సాధ్యం? ఎప్పుడూ కలల్లో ఉంటుందట. నిద్రకు చోటు లేనంతగా అదే పనిగా కలల్లో. సో.. మైలీ.. మీకు కలల్లో నిద్ర వస్తుంది తప్ప, నిద్రలో కలలు రావు. అంతేనా?! షి ఈజ్‌ యంగ్‌ ఇన్‌ ఏజ్‌. అండ్‌ యంగర్‌ ఎట్‌ హార్ట్‌. పాట మార్దవంగా ఉంది. జోల పాటలా. బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌.. మిస్‌ అవకండి ఈ సాంగ్‌లో మైలీ సైరస్‌నీ, సైరస్‌ వాయిస్‌నీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top