ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఈ వారం యూట్యూబ్  హిట్స్‌


జాణల్లా జీవించారు.. రాణుల్లా పోరాడారు

బేగం జాన్‌ : ట్రైలర్‌

నిడివి : 2 ని. 55 సె.

హిట్స్‌ : 1,45,37,696


లివ్డ్‌ యాజ్‌ ఓర్స్, ఫాట్‌ యాజ్‌ క్వీన్స్‌.. ‘బేగమ్‌ జాన్‌’ చిత్రం ట్రైలర్‌ ట్యాగ్‌ లైన్‌ ఇది. శ్రీజిత్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ‘బేగం జాన్‌’లో బేగంగా విద్యాబాలన్‌ నటిస్తున్నారు. ఆమెతో పాటు ఉద్ధండులైన నసీరుద్దీన్‌ షా, ఇళా అరుణ్‌ మొదలైన వాళ్లు! బెంగాలీ చిత్రం ‘రజ్‌కహిని’ కి ఇది రీమేక్‌. 1947 కాలం నాటి ఈ కథలో విద్యాబాలన్‌ బ్రోతల్‌ హౌస్‌ పెద్దమ్మిగా నటించారు. భారతదేశ చివరి వైశ్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌ ఆదేశాల ప్రకారం దేశ విభజన జరుగుతుంది. ఆ విభజన రేఖ విద్యాబాలన్‌ ఇంటి మీదుగా వెళుతుంది. అంటే ఇంటిని అక్కడి నుంచి తొలగించాలి. అధికారులు వస్తారు. ఇల్లు ఖాళీ చెయ్యాలని చెబుతారు. ఇండియా– పాకిస్థాన్‌ విభజన రేఖ ఈ ఇంటి గుండా పోతుందని చెబుతారు. విద్యాబాలన్‌ వినదు. ‘బ్రోతల్‌ హౌసే కదా.. ఖాళీ చెయ్యడానికి ఏమయింది?’ అని అంటారు అధికారులు. ‘బ్రోతల్‌ హౌసే.. కానీ ఇది మా ఇల్లు’ అని చెబుతుంది విద్య.



‘విభజన పేరుతో ఎవరైనా ఈ ఇంటిని ధ్వంసం చెయ్యాలని చూశారా వారి కాళ్లను, చేతులను వాళ్ల దేహం నుంచి వేరు చేస్తాను అంటుంది’ విద్య. ‘నిన్ను చంపేస్తారు’ అని హెచ్చరిస్తారు. ‘రాణిలా ఛస్తాను కానీ ఇక్కడి నుంచి కదలను. ఏం చేస్తారో చెయ్యండి’ అంటుంది విద్య. బ్రిటిష్‌ అధికారులకు, విద్యాబాలన్‌ ‘కుటుంబ సభ్యులకు’లకు పోరు మొదలౌతుంది. తర్వాత ఏమౌతుంది? ఏప్రిల్‌ 14న సినిమా రిలీజ్‌ అయ్యేవరకు ఆగాలి. ట్రైలర్‌లో కథంతా తెలిసినట్లు అనిపిస్తుంది. ఇంతకు ఇంతా కథ ఈ యాక్షన్‌ డ్రామా చిత్రంలో ఉండబోతోంది.



పిల్లలకు చూపించండి... ఎంజాయ్‌ చేస్తారు
యామ్‌ట్రాక్‌ స్లో–మో కొల్లీషన్‌
నిడివి : 42 సె.
హిట్స్‌ : 54,65,55

‘స్టెల్లా’ మంచు తుపాను రెండు రోజుల క్రితం యు.ఎస్‌.లోని కొన్ని ప్రాంతాలను అస్తవ్యస్తం చేసేసింది. దాని ఎఫెక్ట్‌ ఇంకా అక్కడక్కడా ఉంది. ముఖ్యంగా మసాచుసెట్స్‌ రాష్ట్రంలో అనేక చోట్ల రహదారులు మంచులో కూరుకుపోయాయి. ఇళ్లు, వాకిళ్లు కనుమరుగైపోయాయి. లోపల ఎవరున్నారో, బయట నుంచి ఎవరొస్తున్నారో కనుక్కోవడం కష్టం అయిపోయింది. ఇక లోకల్‌ రైలు పట్టాలపై 20 అంగుళాల ఎత్తున మంచు పేరుకుపోయింది.

ర్యాన్‌క్లిఫ్, న్యూయార్క్‌ స్టేషన్‌ల గుండా నిత్యం పరుగులు తీసే ప్యాసింజర్‌ రైళ్లు ఈ రెండు రోజులూ పట్టాలు కనిపించకుండా పెద్ద పలకలా గడ్డకట్టుకు పోయిన మంచును స్లో మోషన్‌లో కోసుకుంటూ నడిచాయి. ఈ వీడియోలో మీకు అలాంటి ‘అత్యద్భుతమైన’దృశ్యమే కనిపిస్తుంది. ‘యామ్‌ట్రాక్‌’ కార్పోరేషన్‌ రైలు స్టేషన్‌లోకి వస్తున్నప్పుడు దానిని ఎక్కేందుకు స్టేషన్‌లో నిలబడిన ప్యాసింజర్లు కొందరు స్మార్ట్‌ఫోన్‌లలో చిత్రీకరించారు. వాళ్లలో ఒకరు ఇదిగో ఇలా యూట్యూబ్‌లో పెట్టారు. పెట్టిన కొద్ది సేపటికే లక్షలో హిట్స్‌ వచ్చిపడ్డాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top