ఆ నేడు 1 సెప్టెంబర్ 1952

ఆ  నేడు 1 సెప్టెంబర్ 1952 - Sakshi


అలలే కలలై

 

అమెరికన్ రచయిత ఎర్నెస్ట్ హెమింగ్వే జీవితాన్ని సార్థకం చేసి, అతని పేరుకు పర్యాయ పదంగా నిలిచిన నవల ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’. ఆనాడు ఇదే రోజు అమెరికన్ మ్యాగజైన్ ‘లైఫ్’లో ఈ నవల మొదలైంది.  నవల పుణ్యమా అని రెండు రోజుల్లోనే లక్షలాది ‘లైఫ్’ కాపీలు అమ్ముడయ్యాయి! ఆ తర్వాతి ఏడాది మళ్లీ ఇదే రోజు... అంటే సెప్టెంబర్ 1న ఈ నవల తొలిసారిగా పుస్తక రూపంలో వచ్చింది. ఆ తరువాత పులిట్జర్ అవార్డ్ గెలుచుకుంది. సాహిత్యంలో హెమింగ్వే నోబెల్ బహుమతి గెలుచుకునేలా చేసింది.



నవల విజయం హెమింగ్వేను ఇంటర్నేషనల్ సెలబ్రిటీని చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమై, మరెన్నో ఉత్తమపుస్తకాలకు ప్రేరణగా నిలిచిన ఈ నవల శాంటియాగో అనే చేపలు పట్టే వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. వృద్ధుడి అలుపెరగని పోరాటం, విశాలమైన సముద్రం... నిజజీవితంలోని ఎన్నో మార్మికసత్యాలను తెలియజేస్తుంటాయి.

 

 

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top