ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చుకోవాలి

ప్రపంచాన్ని చూసే దృష్టిని మార్చుకోవాలి - Sakshi


ఆధ్యాత్మిక సాధనకు ప్రస్తుత జీవితం నుంచి దూరంగా పారిపోనవసరం లేదని, జీవితాన్ని తెలివితో అర్థం చేసుకుని వివేకంతో జీవించాలన్నది స్వామి చిన్మయానంద బోధలు కొన్ని:



► మనస్సును రాగద్వేషాలనుంచి, గతం నుంచి, భవిష్యత్‌ నుంచి దూరంగా ఉంచగలిగినప్పుడు ఆందోళనలకు, అలజడులకు దూరంగా ఉండగలం.  

►  జీవితాన్ని భగవంతునికి అంకితం చేసి, ఏ ఫలితాన్ని అయినా భగవత్‌ ప్రసాదంగా స్వీకరించడమే సాధకుని ప్రథమ కర్తవ్యం.

► శాశ్వతమైన సుఖసంతోషాలు వస్తువుల వల్ల, పరిశోధనవల వల్ల రావు, మనలో ఆధ్యాత్మిక విలువలు పెరగడం వల్లనే లభిస్తాయి.

►  బుద్ధి సూక్ష్మంగానూ, చురుకుగానూ, మనస్సు నిర్మలంగానూ, నిశ్చలంగానూ ఉన్నప్పుడే ఆత్మవిచారణ చేయడానికి తగిన అర్హత లభిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉంచి, దానిని చూసే దృష్టి మార్చుకోవాలి. దీనివల్ల తాను, భగవంతుడు ఒకటేనని అనుభవం కల్గుతుంది. ఎటువంటి అవాంతరాలు ఎదురైనా, స్థిరంగా ప్రశాంతంగా ఉండగలగటం సాధ్యమవుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top