ఎండాకాలం ముఖ కాంతి...

ఎండాకాలం ముఖ కాంతి...


బ్యూటిప్స్

* ఎండాకాలం చర్మం ఇరిటేషన్‌కు లోనై దద్దుర్లు వస్తుంటాయి. జిడ్డుగా ఉన్న ముఖ చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. మొటిమలు పెరగడం, జీవం కోల్పోవడం వంటి సమస్యలు విసిగిస్తాయి. వీటికి విరుగుడుగా..

* మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.



* ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది.

* టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. పాలు చర్మంలో బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది.

* బార్లీ పొడిలో పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి జీవకళ వస్తుంది.

* కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఎండ వల్ల నిస్తేజంగా మారిన ముఖ చర్మం మిలమిలలాడుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top