కూల్‌ ఐడియా

కూల్‌ ఐడియా


మెలన్‌ టాంగో

ఎండాకాలంలో విరివిగా లభించే కర్బూజతో వెరైటీ జ్యూస్‌. విటమిన్‌ సి మెండుగా ఉండే మెలన్‌ టాంగో తాగితే ఎండతాకిడికి కోల్పోయిన శక్తిని తిరిగి పొందవచ్చు.

కావలిసినవి

కర్బూజ ముక్కలు : రెండు కప్పులు కమలాపండ్లు  : రెండు చక్కెర  : రెండు టీ స్పూన్లు నల్ల ఉప్పు : చిటికెడు



తయారీ

కర్బూజ ముక్కలను, కమలాపండు తొనలను మిక్సీలో బ్లెండ్‌ చేసి వడపోయాలి. చక్కెర, నల్ల ఉప్పు కలపాలి. దీని తయారీకి ఐదు నిమిషాలు పడుతుంది. పై కొలతల ప్రకారం చేస్తే నాలుగు గ్లాసుల టాంగో వస్తుంది.



చలువ చేసే కిస్‌మిస్‌ డ్రింక్‌

బాడీ టెంపరేచర్‌ని అదుపులో ఉంచడమే కాకుండా శరీరానికి మంచి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది కిస్‌మిస్‌ పానీయం.

కావలసినవి

వేడినీరు – ఒక గ్లాస్‌ ఎండుద్రాక్ష – 50 గ్రాములు గ్లూకోజ్‌ –  రెండు టీ స్పూన్లు



తయారీ

ఎండుద్రాక్షను మంచినీటితో శుభ్రపరిచి రాత్రి పూట వేడినీటిలో నానబెట్టాలి. తెల్లవారిన తర్వాత ద్రాక్షను మిక్సీలో పేస్ట్‌లా చేసి, ఈ గ్లాసుడు నీటిలో కలిపి తాగితే తక్షణ శక్తి వస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top