దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది!

దీర్ఘకాలిక చెవి వాపు తగ్గుతుంది!


హోమియో కౌన్సెలింగ్‌



మా పాపకు ఎనిమిదేళ్లు. మూడేళ్ల నుంచి చెవినొప్పితో పాటు చీము, వాపు కనపడుతున్నాయి. ఈ ఏడాది ప్రతిరోజూ వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే, కానీ ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్‌టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్‌ చెయ్యాలంటున్నారు. హోమియోలో చికిత్స చెప్పండి.   – నరహరి, కొత్తగూడెం

మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్‌ ఒటైటిస్‌ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది  ఏ వయసు వారిలోనైనా   రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు.



కారణాలు : ∙కర్ణభేరి (ఇయర్‌ డ్రమ్‌)కు రంధ్రం ఏర్పడటం  ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్‌ వల్ల ఈ సమస్య రావచ్చు.



లక్షణాలు : ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం.



నిర్ధారణ : ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్‌–రే



చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్‌ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి.



డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)

స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top