న్యూజిలాండ్

రాజధాని వెల్లింగ్‌టన్ నగరం


ప్రపంచ వీక్షణం

 

ఖండం: యూరప్

వైశాల్యం: 2,68,021 చదరపు కిలోమీటర్లు

జనాభా:  45,70,038  (తాజా అంచనాల ప్రకారం)

రాజధాని: వెల్లింగ్‌టన్

కరెన్సీ: న్యూజీలాండ్ డాలర్

భాషలు: ఇంగ్లిష్, మావోరీ, ఇతర పాలినేసియన్ భాషలు

ప్రభుత్వం : యూనిటరీ పార్లమెంటరీ కాన్‌స్టిట్యూషనల్ మొనార్చీ

మతం: 81% క్రైస్తవులు

వాతావరణం: జులైలో 6 నుండి 12 డిగ్రీలు, జనవరిలో 13-21 డిగ్రీలు.

పంటలు:  పప్పు దినుసులు, పళ్లు, కూరగాయలు

పరిశ్రమలు: సహజ వాయువులు, పేపర్, ఇనుము, ఉక్కు,

అల్యూమినియం, ఎరువులు, సిమెంట్, గ్లాసు, రవాణా పరికరాలు, యంత్రాలు, దుస్తులు, పాలు, మాంస ఉత్పత్తులు, బీరు.

ఎగుమతులు: మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని, కలప, కాగితం,

చేపలు, పళ్లు, కూరగాయలు, జంతు చర్మం.

స్వాతంత్య్రం: 1947, డిసెంబర్  10

సరిహద్దులు: నలువైపులా పసిఫిక్ మహా సముద్రం

 


 

చరిత్ర



న్యూజిలాండ్ దీవులను క్రీ.శ. 1642లో డచ్చి దేశపు సముద్ర యాత్రీకుడు అబెల్ టాస్మాన్, అతని అనుచరులు కనిపెట్టారు. అతడు ఆ దీవులలో అడుగు పెట్టినపుడు ఆ దీవులలో నివసిస్తున్న మావోరీ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఆ తరువాత 1769 వరకు ఎవరూ ఆ దీవులకు వె ళ్లలేదు. 1769లో బ్రిటిష్ నావికుడు జేమ్స్‌కుక్ ఆ దీవులకు వెళ్లాడు. అప్పటినుండి ఆ దీవులపై బ్రిటిష్ ప్రభువుల ఆధిపత్యం కొనసాగింది. దీవులలో నివసిస్తున్న మావోరీ తెగల ప్రజలను బ్రిటిష్ వాళ్లు క్రమంగా క్రిస్టియన్లుగా మార్చడం ఆరంభించారు. 19వ శతాబ్దం నాటికి దేశంలో అంతర్యుద్ధాల కారణంగా వేలాది మావోరీలు చనిపోయారు. క్రిస్టియన్ మిషినరీలు క్రమంగా దేశంలో పెరిగిపోయాయి. 1835లో ఫ్రెంచి రాజులు దండయాత్ర చేసినపుడు బ్రిటిష్ ప్రభువులు ఫ్రెంచి వాళ్లను తరిమేశారు. 1840లో న్యూజిలాండ్‌లో కొంత భాగానికి స్వాతంత్య్రం ప్రకటించారు. 1854లో స్వతంత్ర పార్లమెంటు ఏర్పాటయింది. 1891లో రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. 1907లో డొమినియన్ ఆఫ్ న్యూజిలాండ్ ఏర్పడింది. ఇప్పటికీ ఇంగ్లాండ్ దేశపు రాణి న్యూజిలాండ్‌కు కూడా రాణిగా వ్యవహరిస్తోంది.

 

 పంటలు - పరిశ్రమలు



న్యూజిలాండ్ దేశం రెండు ప్రధానమైన దీవులుగా ఉంటుంది. ఉత్తర దీవులలో జనాభా అధికంగా ఉంటుంది. దక్షిణ దీవులలో అధికభాగం పర్వతాల మయం. దక్షిణ భాగం అంతా పర్వతాల మయం కావడం వల్ల వ్యవసాయానికి అనువైన భూమి తక్కువగా ఉంది. అనువైన ప్రదేశాలలో పప్పు దినుసులు, పళ్లు, కూరగాయల తోటలు, ద్రాక్ష తోటలు అధికంగా ఉన్నాయి. గొర్రెలు, ఆవుల పెంపకం చాలా అధికం. దేశంలో గొర్రె మాంసం, పాలు, పాల ఉత్పత్తులు దేశంలో అంతగా డిమాండ్ లేకపోవడం వల్ల ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ రెండింటి ఎగుమతులలో ఈ దేశంలో ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఇక ఉత్తర  దీవులలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అడవుల శాతం అధికం కావడం వల్ల ఫర్, ఫైన్ వృక్షాలు అధికంగా పెరుగుతున్నాయి. వీటి నుండి గుజ్జు తీసి పేపరు తయారు చేస్తారు. దుస్తుల తయారీ, సారాయి ఉత్పత్తి, రసాయనాలు, ఎరువుల పరిశ్రమలు, గ్లాసు, సిమెంట్ పరిశ్రమలు, ఉన్ని, కలప ఉత్పత్తి పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.



పరిపాలనా రీతులు



న్యూజిలాండ్ దేశానికి ఇప్పటికీ ఒక రాజు ఉంటాడు. అలాగే దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు. ఈ ఇద్దరూ పరిపాలనలో పాలు పంచుకుంటారు. పరిపాలనా సౌలభ్యం కోసం దేశం 11 రీజియన్ కౌన్సిల్‌లుగా 67 టెర్రిటోరియల్ అథారిటీలుగా విభజింపబడింది. దేశంలో మొత్తం 249  మున్సిపాలిటీలు ఉన్నాయి. దేశంలో ప్రధానమైన నగరాలు ఇవి. రాజధాని వెల్లింగ్‌టన్, ఆక్లాండ్, క్రైస్ట్‌చ ర్చ్, హామిల్టన్, నేపియర్-హాస్టింగ్స్, తౌరంగా, డునెడిన్, పాల్మర్‌స్టోన్ నార్తే, నెల్సన్, రోటోరువా, న్యూ ఫ్లైమత్, వంగారి, ఇన్వర్ కార్గిల్.

 

ప్రజలు - సంస్కృతి




దేశంలో ఉన్న జనాభాలో 75% మంది యూరోపియన్‌లు, 15% మంది మావోరీలు ఉన్నారు. దేశంలో భిన్నమైన సంస్కృతి దర్శనమిస్తుంది.  దేశంలో 98% ప్రజలు ఇంగ్ల్లిషు భాష మాట్లాడుతారు. మావోరీ భాషను కూడా అధికారిక భాషగా గుర్తించారు. జనాభాలో దాదాపు 50% ప్రజలు క్రైస్తవ మతాన్ని అవలంబిస్తే మిగిలిన వారు తటస్థులుగా ఉంటారు.



గ్రామీణ ప్రజలు వ్యవసాయం చేస్తారు. చదువుకున్న వాళ్లంతా పట్టణాలకు వెళ్లిపోయి ఉద్యోగాలు, పరిశ్రమలలో కార్మికులుగా జీవనం కొనసాగించడం వల్ల గ్రామీణ ప్రాంతాలు తక్కువగా కనిపిస్తాయి. పూర్వం నుండీ ఉన్న మావోరీ సంస్కృతిని ఇప్పటి ఆధునిక సంస్కృతి క్రమంగా నిర్మూలిస్తూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే మావోరీ సంస్కృతి కనబడుతుంది. వివిధ సందర్భాలకు తగిన పండుగలు జరుపుకొన్నప్పుడు మాత్రం అందరూ దానిలో పాల్గొంటారు.



దేశంలో చూడదగిన ప్రదేశాలు



న్యూజిలాండ్ ఒక అద్భుతమైన పర్యాటక దేశంగా పేరుగాంచింది. భారతదేశంతో సహా ఎన్నో దేశాల నుండి ప్రజలు లక్షలాదిగా ప్రతి సంవత్సరం ఈ దేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. దేశంలో చూడదగిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని వెల్లింగ్‌టన్, ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్, క్వీన్స్ టౌన్, రోటోరువా, బే ఆఫ్ ఐలాండ్స్, వైటోమో గుహలు, ఆల్ఫ్స్ పర్వతాలు, మిల్‌ఫోర్డ్ సౌండ్, అబెల్ టాస్మాన్ నేషనల్ పార్కు... ఇలా ఎన్నో ఉన్నాయి.



ఆక్లాండ్



దేశంలో ఆక్లాండ్ అతి పెద్ద నగరం. నగరం నడిబొడ్డున ఉన్న స్కై టవర్‌ను దర్శించడం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ టవర్ 360 డిగ్రీలుగా తిరుగుతోంది. ఈ టవర్ పై నుండి చూస్తే దాదాపు 80 కిలోమీటర్ల వరకు అన్నీ కనిపిస్తాయి. పై భాగంలో ఒక రెస్టారెంట్ కూడా ఉంది.  ఈ టవర్ పైనుండి బంగీ జంప్ చేయవచ్చు. నగరంలో ఆక్లాండ్ మ్యూజియం, నావల్ మ్యూజియం, బ్రిడ్జిలు,  జూ, సముద్రంలో వివిధ చిన్న చిన్న ద్వీపాలు, విక్టోరియా మార్కెట్ నగరం చుట్టూ దాదాపు 50కి పైగా సుప్తావస్థలో ఉన్న అగ్ని పర్వతాలు, అందమైన భవంతులు, రోడ్లు యాత్రికులను అబ్బుర పరుస్తాయి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ సెయిల్ అని పిలుస్తారు.  నగరంలో నివసిస్తున్న వారికి ప్రతి ఒక్కరికీ ఒక సొంత పడవ ఉంటుంది. సముద్ర తీరంలో చూస్తే వేలాది పడవలతో నిండి ఉంటుంది. విక్టోరియా భవనం చూడదగ్గది. అత్యంత సురక్షిత నగరంగా దీనికి పేరుంది.



అబెల్ టాస్మాన్ నేషనల్ పార్క్



నిజానికి దేశంలో మొత్తం 14 జాతీయ పార్కులు ఉన్నాయి.  వాటిలో ముఖ్యమైనది అబెల్ టాస్మాన్ పార్కు. ఇది నెల్సన్ నగరానికి సమీపంలో ఉంది.



ఈ పార్కులో బీచ్‌లు, గ్రానైట్ కార్వింగ్‌లు,  ట్రెక్కింగ్ కోసం పర్వతాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ పార్కులో కోస్ట్‌ట్రాక్, ఆంకోరేజ్ హట్‌లలో సేదదీరవచ్చు. ఈ పార్కు మొత్తం 22,530 హెక్టార్ల విస్తీర్ణంలో నెలకొని ఉంది. 1942లో ఈ పార్కును అభివృద్ధి చేశారు. పార్కులో రకరకాల జీవ జంతువులు నివాసం ఉన్నాయి. రకరకాల పక్షులు, చిన్న జంతువులు ఉన్నాయి. గ్రానైట్ రాక్స్ చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.  ఇక్కడ మావోరీ సంస్కృతికి  నిదర్శనంగా గ్రామాలు, అక్కడి ప్రజలు దర్శనమిస్తారు. దేశంలోని ఇతర పార్కులు ఆథర్స్‌పాస్ నేషనల్ పార్కు, ఎగ్మాంట్ నేషనల్ పార్కు, కహురంగి నేషనల్ పార్కు, మౌంట్‌కుక్ నేషనల్ పార్కు, నెల్సన్ లేక్స్ నేషనల్ పార్కు, పాపరోవా నేషనల్ పార్కు, రకియూర నేషనల్ పార్కు, టోంగారిలో నేషనల్ పార్కు, వంగనూయి నేషనల్ పార్కు ఇలా అన్నింటినీ దేశంలో దర్శించవచ్చు.



వేడి నీటి చలమల రొటోరువా



దేశ ఉత్తర ఐలాండ్‌లో నెలకొన్న రోటోరువా ప్రాంతం వేడి నీటి, బురద నీటి చలమలకు ప్రసిద్ధి. నిరంతరం వేడి నీరు భూమిలోంచి బయటకు వస్తూ ఉంటుంది. వీటితో పాటు ఒక సమాధి అయిపోయిన గ్రామం కూడా ఈ రోటోరువా నగర సమీపంలో మనకు కనిపిస్తుంది. రోటోరువా సరస్సు, దాని చుట్టూ ఈ వేడినీటి, బురద చలమలు దర్శనమిస్తాయి. అందువల్ల ఈ నగరాన్ని సల్ఫర్ సిటీ అని కూడా పిలుస్తారు. చాలామంది ఇక్కడికి బురద స్నానం చేయడానికి వస్తుంటారు. భూమి లోపల ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ పైకి నీరు, బురదతో పాటు ఉబికి వస్తూ ఉంటుంది. ఇక్కడ బురద స్నానం చేయడం వల్ల నరాల బాధలు తగ్గుతాయని భావిస్తారు. ఈ ప్రాంతంలో మొత్తం 17 చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. ఇక్కడే బొటానికల్ గార్డెన్, రోటోరువా మ్యూజియంలు, పోస్టల్ క్లబ్, కైటునానది... ఇలా ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి.



క్రైస్ట్ చర్చ్



దేశ దక్షిణ ద్వీపంలో ఉన్న అతి పెద్ద నగరం క్రైస్ట్ చర్చ్. నగరానికి సమీపంలో తెల్లగా మంచుతో కప్పబడిన ఆల్ఫ్స్ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. 1856లో ఈ నగరం ప్రభువుల నగరంగా ఉత్తరంగా వైమాకారిణి నది ప్రవహిస్తూ ఉంటుంది. నగరంలో కాంటర్‌బరీ మ్యూజియం, క్రైస్ట్ చర్చ్ క్యాథడ్రల్, రైల్వేటన్నెల్, ఓడరేవు, హెగ్లే పార్కు, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, లింకన్ విశ్వవిద్యాలయ భవనం, బొటానికల్  గార్డెన్, వెస్ట్రన్ హౌస్, విక్టోరియా సరస్సు ఇలా ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉంటాయి. ఈ నగరంలో మావోరీ సంస్కృతి ఎక్కువగా ప్రతిబింబిస్తుంది. నగరమంతా కూడా ఎంతో శుభ్రంగా, ఇంకెంతో సుందరంగా కనిపిస్తుంది. ఎక్కడా చెత్తా చెదారం కనిపించదు. నగరంలో అంతర్గత రవాణాకు బస్సులు, ట్రాక్ సర్వీసులు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

 

వెల్లింగ్‌టన్



వెల్లింగ్‌టన్ నగరానికి ప్రధాన ఆకర్షణ ఓడరేవు.  మొత్తం ప్రపంచంలో అతి చల్లని ప్రదేశంగా ప్రసిద్ధిగాంచింది. వివిధ దేశాల నుండి పర్యాటకులు రోజూ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఓరియంటల్ బే లో సేదదీరడం ఒక గొప్ప అనుభూతినిస్తుంది. బంగారు రంగులో ఉండే ఇసుక బీచులు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. నగరంలో టే పాప టోంగారేవ మ్యూజియం, న్యూజిలాండ్ నేషనల్ మ్యూజియంలు తప్పక చూడదగినవి.  నగరంలో దాదాపు ఆరున్నర మిలియన్ల జనాభా ఉంటుంది. నగరం చుట్టూ ఎత్తై కొండలు, మరోవైపు సముద్రం ఉంటాయి. వాతావరణం ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది. నగరంలో ఉన్న బీహైవ్ భవనం తప్పక చూడాలి. ఈ భవనమే ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిక భవనం. దీని నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నగరాన్ని ఆనుకొని సముద్రంలో రెండు చిన్న ద్వీపాలు ఉంటాయి. ఫెర్రీ బోట్‌లో వెళ్లి వాటిని చూడవచ్చు. నగరంలో పోలీస్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, వింటేజ్‌కార్ మ్యూజియం, డేసే ఆర్ట్ మ్యూజియం, మౌంట్ విక్టోరియా, మడ్ సైకి ల్స్, వాటర్ ఫ్రంట్, వెల్లింట న్ జూ మొదలైనవి చూడదగినవి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top