బెడ్‌రూమ్‌లో కూడా టార్గెట్స్ గుర్తొస్తున్నాయ్...

బెడ్‌రూమ్‌లో కూడా  టార్గెట్స్ గుర్తొస్తున్నాయ్... - Sakshi


ప్రైవేట్ కౌన్సెలింగ్

పురుషుల సందేహాలకు సమాధానాలు

 

యుక్తవయసు వచ్చిన తర్వాత సెక్స్ ప్రేరణలు, అంగస్తంభన కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, ఆ ప్రక్రియతో తృప్తి పొందడం చాలా సాధారణం. హస్తప్రయోగం తర్వాత కలిగే తృప్తి, మానసిక, శారీరక రిలాక్సేషన్ వల్ల కాసేపు నీరసంగా అనిపించడం సహజం. అంతేగాని దీనివల్ల శరీరంలో బలం, బరువు తగ్గడానికి అవకాశమే లేదు.

 

నా వయసు 42 ఏళ్లు. మా ఆవిడకు ఇబ్బంది వద్దని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నేనే చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకొని కూడా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు నా వృషణాల్లో బరువుగా అనిపిస్తోంది. ఈమధ్య మెడ, తల నొప్పిగా ఉంటోంది. అలసట వస్తోంది. సెక్స్ కూడా చక్కగా చేయలేకపోతున్నాను. ఈ సమస్యలన్నీ వ్యాసెక్టమీ వల్లనేమో అని అనుమానంగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.

 - కె.వి.ఎస్. ఒంగోలు


 మీరు చెప్పిన సమస్యలతో 39, 40 ఏళ్ల వయసులో చాలామంది మగవాళ్లు బాధపడుతూ ఉంటారు. మీలాగే అపోహ చెంది వాళ్ల సమస్యలను వాసెక్టమీకి ఆపాదిస్తుంటారు. వ్యాసెక్టమీ ఆపరేషన్ చాలా సులువైనది. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. దీర్ఘకాలిక సమస్యలేమీ రావు. వాసెక్టమీ అంటే... వీర్యకణాలు వచ్చే మార్గాన్ని బ్లాక్ చేయడం మాత్రమే. అంతేగాని... వృషణాలు బరువు అనిపించడానికీ, వ్యాసెక్టమీకీ ఎలాంటి సంబంధమూ ఉండదు. మీరు ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను కలిసి మీ సమస్యలకు చికిత్స తీసుకోండి. మీ సమస్యలన్నీ మామూలు చికిత్స ప్రక్రియలతో చక్కదిద్దగలిగేవే.

 

 నా వయసు 23 ఏళ్లు. గత మూడేళ్ల నుంచి హస్తప్రయోగం చేస్తున్నాను. ఇటీవల నా బరువు బాగా తగ్గినట్లు అనిపిస్తోంది. హస్తప్రయోగం తర్వాత విపరీతమైన నీరసంగా ఉంటోంది. హస్తప్రయోగం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందా?

 - డి.కె.ఆర్., కరీంనగర్


 యుక్తవయసు వచ్చిన తర్వాత సెక్స్ ప్రేరణలు, అంగస్తంభన కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, ఆ ప్రక్రియతో తృప్తి పొందడం చాలా సాధారణం. హస్తప్రయోగం తర్వాత కలిగే తృప్తి, మానసిక, శారీరక రిలాక్సేషన్ వల్ల కాసేపు నీరసంగా అనిపించడం సహజం. అంతేగాని దీనివల్ల శరీరంలో బలం, బరువు తగ్గడానికి అవకాశమే లేదు. మీలోని కోరికను బట్టి, మీలో కలిగే సెక్స్ ప్రేరేపణలను బట్టి హస్తప్రయోగం ఎన్నిసార్లు చేసినా దానివల్ల మీకు ఏమాత్రం హాని లేదు. అయితే  బరువు తగ్గినట్లుగా అనిపించడం మీ అనుమానమైతే, హస్తప్రయోగం పట్ల మీకు ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నిజంగానే మీ బరువు తగ్గి ఉంటే దానికి అసలు సమస్య ఏమిటోతెలుసుకొని దానికి చికిత్స తీసుకుంటే మళ్లీ ఆరోగ్యంగా అవుతారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించండి.

 

నా వయుసు 30 ఏళ్లు. నా వృషణాలు చిన్నవిగా వూరాయుని అనిపిస్తోంది. నాకు ఉన్న సవుస్య ఏమై ఉంటుంది? దయుచేసి నా సవుస్యకు సలహా ఇవ్వండి.

 - ఎస్.ఆర్.కె., కందుకూరు


చాలామంది తమ వృషణాల సైజ్ గురించి, పురుషాంగం పరిమాణం గురించి ఆందోళన పడుతుంటారు. అలాంటి ఆందోళన ఉన్నప్పుడు అవి చిన్నగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ అది వాళ్ల అపోహ మాత్రమే. కొందరిలో మాత్రం వేరికోసిల్ వల్ల వుుందు పెద్దవిగా ఉన్న వృషణాలు ఆ తర్వాత సైజ్ తగ్గవచ్చు. వాళ్లలో నొప్పి కూడా ఉండవచ్చు. మీరు ఒకసారి యాండ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. మీకు డాప్లర్ అల్ట్రా సౌండ్ పరీక్ష చేరుుంచి, నిజంగానే సమస్య ఉందా అన్న విషయాన్ని యాండ్రాలజిస్ట్ నిర్ధారణ చేస్తారు. మీ సమస్యను బట్టి చికిత్స ఉంటుంది.

 

మా బాబుకు పదకొండేళ్లు. ఒకరోజు రాత్రి అతడికి అకస్మాత్తుగా వృషణంలో తీవ్రమైన నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళితే వృషణం పూర్తిగా డ్యామేజీ అయ్యిందని, దాన్ని వెంటనే తొలగించాలని అన్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించాం. ఇప్పుడు మా అబ్బాయి పెద్దయ్యాక పెళ్లిచేస్తే ఈ ఆపరేషన్ వల్ల పిల్లలు పుట్టడానికి ఏమైనా సమస్య వస్తుందా?

 - వై.కె.ఆర్., విజయవాడ


 మీరు చెప్పిన సమస్యను టెస్టిక్యులార్ టార్షన్ (వృషణం తిరగబడటం) అంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఆరు గంటలలోపు ఆపరేషన్ చేస్తే తిరగబడ్డ వృషణాన్ని సాధారణ స్థితిలోకి పెట్టవచ్చు. అలా చేస్తే వృషణాన్ని తొలగించాల్సిన అవసరం ఉండదు. మీరు చెప్పినట్లుగా ఇది వైద్యపరంగా అత్యవసరంగా చేయాల్సిన ఆపరేషనే. ఒక్క వృషణమే ఉన్నప్పటికీ మీ బాబుకు భవిష్యత్తులో పిల్లలు పుట్టడానికి ఆ అంశం ఏమీ సమస్య కాబోదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

 నా వయసు 47 ఏళ్లు. ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద పొజిషన్‌లో ఉన్నందువల్ల తీవ్రమైన ఒత్తిడితో ఉంటాను. పైగా అధిగమించాల్సిన టార్గెట్స్ కూడా ఉంటాయి. ఇటీవల కొంతకాలం నుంచి సెక్స్‌లో పాల్గొనలేకపోతు న్నాను. నా సమస్యకు పరిష్కారం సూచించగలరు.

 - జీ.వి.ఎమ్., హైదరాబాద్


 సాధారణంగా నలభై ఏళ్లకు పైబడ్డ పురుషుల్లో వృత్తిరమైన, సామాజిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. దాంతో వారు సెక్స్‌లో అనుకున్నట్లుగా పెర్‌ఫార్మ్ చేయలేకపోవడం చాలా సాధారణమైన సమస్య. సాధారణంగా ఈ వయసులో వారు వారానికి రెండుమూడు సార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటుంటారు. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. మీరు ప్రతిరోజూ యోగా, ఏరోబిక్స్ ఎక్సర్‌సైజ్ చేయండి. దాంతో ఒత్తిడి తొలగిపోవడంతో పాటు ఫిట్‌సెస్ చేకూరుతుంది. మీ సెక్స్ పెర్‌ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండటం అన్నిటికంటే ముఖ్యం. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కొన్నాళ్లు మందులు వాడటం ద్వారా మీ సమస్యను అధిగమించవచ్చు.

 

 నాకు 39 ఏళ్లు. మూత్రవిసర్జన సమయంలో, సెక్స్ చేస్తున్నప్పుడు విపరీతంగా మంట వస్తోంది. స్కానింగ్ చేయించుకుంటే మూత్రాశయంలో 4 సెం.మీ. రాయి ఉందని చెప్పారు. నాకు మంట మినహా ఇతర ఏ సమస్యా లేదు. దీనికి ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయించుకుంటే ఏవైనా సెక్స్ సమస్యలు వస్తాయా? నాకు ఇప్పుడు సెక్స్ సామర్థ్యం బాగానే ఉంది. ఆపరేషన్ తర్వాత సామర్థ్యం తగ్గుతుందేమోనని భయంగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు.

 - ఎమ్.ఆర్., ఖమ్మం


 మూత్రాశయంలో రాళ్లు ఉండటం వల్ల మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చి మంటగా అనిపించడం మామూలే. ఈ రాళ్లను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా తొలగిస్తారు. ఈ ప్రక్రియలో అంగస్తంభన కలిగించే నరాలకు ఎంతమాత్రమూ నష్టం జరగదు. పైగా అవి చాలా దూరంగా ఉంటాయి కూడా. కాబట్టి ఎండోస్కోపీకీ, అంగస్తంభన సామర్థ్యం తగ్గడానికీ ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇన్ఫెక్షన్‌ను ఇలాగే వదిలేస్తే అది కీడ్నీకి కూడా పాకడానికి అవకాశం ఉంది కాబట్టి. మీరు యూరాలజిస్ట్‌ను సంప్రదించి వెంటనే ఎండోస్కోపీ చేయించుకోండి.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top