భారీగా దొరికితే మరణశిక్షే

భారీగా దొరికితే మరణశిక్షే - Sakshi


►  డ్రగ్స్‌ ఉంటేనే పెడ్లర్‌ కాదు!

భారీ మొత్తం ఉంటేనే, విక్రయించి ఉంటేనే పెడ్లర్‌

మార్పునకూ ఆస్కారం ఇస్తున్న ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌


భారీ మొత్తంలో దొరికితే మరణశిక్షకూ ఆస్కారం



ఎస్‌ (నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌) యామాదకద్రవ్యాల కేసుల్ని పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు ఎన్‌డీపీక్ట్‌–1985 కింద నమోదు చేస్తారు. ఈ చట్టం డ్రగ్స్, వాటి పరిమాణం, వినియోగదారులు, విక్రేత (పెడ్లర్‌).. ఇలా అనేక నిర్వచనాలు ఇచ్చింది. ఇదే చట్టం మాదకద్రవ్యాలకు బానిసలైన వారు మారేందుకు అవకాశం కల్పిస్తోంది. భారీ మొత్తంలో డ్రగ్‌తో దొరికితే మరణశిక్ష విధించడానికీ ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద ఆస్కారం ఉంది.



ప్రాథమికంగా డ్రగ్‌ను కలిగి ఉండో, విక్రయిస్తోనో, సేవిస్తూనో చిక్కిన వారిని మాత్రమే అరెస్టు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.



తక్కువ పరిమాణంలో మాదకద్రవ్యంతో చిక్కిన వారిని వినియోగదారులుగా పరిగణించే అవకాశం ఉంది. ఏ డ్రగ్, ఎంత మొత్తంలో దొరికితే వినియోగదారుడిగా పరిగణించాలి అనేది దర్యాప్తు అధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుంది.



మాదకద్రవ్య వినియోగదారులపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 27 కింద కేసు నమోదు చేస్తారు. ఈ నిందితులు న్యాయస్థానంలో హాజరైనప్పుడు తాము బానిసలయ్యామని, మార్పునకు అవకాశం ఇవ్వమని కోర్టును కోరే ఆస్కారం ఉంది.



ఇలా వేడుకున్న సందర్భాల్లో న్యాయస్థానం ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 64 (ఏ) కింద వారికి ఓ అవకాశం ఇస్తుంది. తద్వారా రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు వెళ్ళి మారడానికి ఆస్కారం ఏర్పడుతుంది.



రక్తం, మెదడుపై మాత్రమే ప్రభావం చూపించే వాటిని నార్కోటిక్స్‌ అంటారు. ఈ తరహాకు చెందిన కన్నాబీస్‌ (గంజాయి మొక్క) ఉత్పత్తులతో చిక్కిన వారిపై అధికారులు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 20 కింద కేసు నమోదు చేస్తారు. గంజాయి, హాష్, భంగు, ఆశిష్, చెరస్‌ ఇవన్నీ కన్నాబీస్‌ నుంచే వస్తాయి.



వీటితోపాటు సహజ ఉత్పత్తుల ఆధారంగా తయారయ్యే కొకైన్, బ్రౌన్‌షుగర్, హెరాయిన్, మార్ఫిన్‌ వంటి వాటినీ నార్కోటిక్‌ డ్రగ్స్‌ కిందే పరిగణిస్తారు. వీటికి సంబంధించి అధికారులు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 21 కింద కేసు నమోదు చేస్తారు.



ఏ డ్రగ్స్‌ ప్రభావమైతే మనిషి నాడీ వ్యవస్థపై ఉంటుందో వాటిని సైకోట్రోఫిక్‌ సబ్‌స్టాన్సెస్‌గా పేర్కొంటారు. ఎండీఎంఏ (ఎక్స్‌టసీ), ఎల్‌ఎస్‌డీ, ఎల్‌ఎస్‌ఏ ఇవన్నీ వీటి పరిధిలోని వస్తాయి. దాదాపు రసాయనాలతో సమానమైన, ప్రయోగశాలల్లో తయారయ్యే ఇలాంటి ఉత్పత్తులతో చిక్కిన వారిపై అధికారులు ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 22 కింద కేసు నమోదు చేస్తారు.



కొకైన్‌ 500 గ్రాములు అంత కంటే ఎక్కువ, నల్లమందు 10 కేజీలు అంతకంటే ఎక్కువ, హెరాయిన్, మార్ఫిన్‌లు కేజీ అంతకంటే ఎక్కువ మోతాదుతో చిక్కిన వారికి ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ ప్రకారం మరణశిక్ష పడటానికీ ఆస్కారం ఉంది.

– కామేశ్‌



 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top