మన మార్కెట్‌లోకి లూమియా 930


అక్టోబర్ 15 వ తేదీ నుంచి ఇండియన్ మార్కెట్‌లో లూమియా 930ని అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ స్టార్ట్‌ఫోన్ విడుదల అయ్యింది. జూన్‌కళ్లా భారత్‌లో అందుబాటులోకి వస్తుందని టెక్ పండితులు అంచనా వేశారు. అయితే ఆ అంచనాలు ఫలించలేదు. క్వాల్‌కామ్‌స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ 2జీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉంటుంది. దీనికి మెమొరీ కార్డ్ స్లాట్ ఏదీ ఉండదు.

 

ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా ఫోటోగ్రఫీ ప్రేమికులను తెగ ఆకట్టుకొంటోంది. లూమియా 1520 లాగే ఈ ఫోన్‌లో కూడా 20 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా ఉంటుంది. వీడియో రికార్డింగ్ విషయంలో కూడా నోకియా రిచ్ రికార్డింగ్ టెక్నాలజీ ఇన్‌స్టాలై ఉంటుంది. ఇందులో ఆడియో రికార్డింగ్ టెక్నాలజీ కూడా అద్వితీయం అనే రివ్యూలు వినిపిస్తున్నాయి. వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్ట్ చేసే బ్యాటరీ మరో ప్రత్యేకత. ధర దాదాపు 38,649 రూపాయలు.

 

శామ్‌సంగ్ నుంచి 4జీ ఫోన్!

 

మన దగ్గర ఇంకా మారుమూల ప్రాంతాలకు త్రీజీ సేవలే ప్రవేశించలేదు కానీ... అప్పుడే నాలుగోతరం ఇంటర్నెట్ సేవలను అందిపుచ్చుకోవడానికి తగిన స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కొరియన్ దిగ్గజం శామ్‌సంగ్ ఒక 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. గెలాక్సీ సిరీస్‌లో శామ్‌సంగ్ ఈ ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు గెలాక్సీ ఆల్ఫా 4జీ. నాలుగో తరం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో వాటికి తగ్గట్టుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించినట్టుగా శామ్‌సంగ్ పేర్కొంది.



6.7మిల్లీమీటర్ల థిన్‌నెస్‌తో ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ బరువు కేవలం 115 గ్రాములే. 4.7 ఇంచ్ హెచ్‌డీ ఏమొలెడ్ డిస్‌ప్లేతో, ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఉండే దీనికి 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా ఉంటుంది. గెలాక్సీ గేర్ ఫిట్, గేర్ 2, గేర్2 నియో, అండ్‌గేర్ ఎస్ వంటి వేరబుల్ డివెజైస్‌తో ఈ ఫోన్ కనెక్ట్ అవుతుంది. భారత్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ విలువ దాదాపు 40 వేల రూపాయలు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top