Alexa
YSR
‘ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంతటి కృషికైనా సిద్ధంగా ఉండాలి’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఫ్యామిలీకథ

న న్నడగొద్దు ప్లీజ్‌

Sakshi | Updated: April 20, 2017 23:46 (IST)
న న్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌

గురూజీ... నేను ఒక అమ్మాయిని వన్‌ ఇయర్‌ నుంచి లవ్‌ చేస్తున్నా. తనకి ప్రపోజ్‌ చేస్తే... ‘బ్రదర్‌ నాకు ఆల్‌ రెడీ లవర్‌ ఉన్నాడు’ అంది. నేను చాలా ఫీల్‌ అయ్యాను. తరువాత ఆ విషయం మా ఫ్రెండ్‌కి చెబితే నువ్వు కూడా సిస్టర్‌ అనరా అన్నాడు. దాంతో నేను తను కనిపించినప్పుడు... ‘సిస్టర్‌ ఇన్ని రోజులు నీ వెంట తిరిగినందుకు మంచి సజెషన్‌ ఇచ్చావు, బై’ అన్నాను. తను ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది. తరువాత వాళ్ల ఫ్రెండ్‌తో ‘అన్నయ్యకి రోజూ హాయ్‌ చెబుతానని చెప్పు’ అందట.

ఆ విషయం తెలిసి, నాకు ఏదో పాజిటివ్‌ రెస్పాన్స్‌లా అనిపించి... నెక్ట్స్‌ డేనే తనను కలిసి ‘నిన్ను వదలను’ అని చెప్పి వచ్చేశా. తను స్మైల్‌ ఇచ్చింది. తన బర్త్‌ డేకి గిప్ట్‌ ఇస్తే తీసుకుంది. తరువాత మంచి ఫ్రెండ్స్‌ అయిపోయాం. రోజుకి ఫోర్‌ అవర్స్‌ మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ‘మనం లైఫ్‌ లాంగ్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉండిపోదాం’ అంటోంది. నాకు మాత్రం తనని పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి గురూజీ? – సాయి కుమార్‌

బ్రదర్‌... నీలాంటి ఇంటెలిజెంట్‌ పర్సన్స్‌... ఈ పాయింట్‌ ఎప్పుడో ఒక్కసారైనా వినే ఉంటారు. ఒకవేళ మరిచిపోయి ఉంటే... ఇంకోసారి గుర్తు చేస్తున్నా. ‘ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌’ మీ ఊర్లో ఒక మంచి మనసు ఉన్న టెంట్‌హౌస్‌ వాడు ఉండే ఉంటాడు.
వాడి గెడ్డం పట్టుకుని... రెంటుకు ఒక మైక్, ఒక లౌడ్‌ స్పీకర్‌ అద్దెకు తెచ్చుకుని... ఒక హండ్రెడ్‌ టైమ్స్‌ గట్టిగా అమ్మాయి ఇంటి ముందు నిలబడి... ‘ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌’ అని అనౌన్స్‌ చెయ్యి. గొడవపోతుంది. నీ మనసు చల్లబడుతుంది. బాధ తక్కువ అవుతుంది. మెల్ల మెల్లగా లైఫ్‌ నార్మల్‌ అవుతుంది. జీవితం మీద మళ్లీ ప్రేమ కలుగుతుంది. ‘ఏడ్చినట్లు ఉంది సర్‌’ మీ సజెషన్‌.


‘అమ్మాయి గిఫ్ట్‌ తీసుకుంది, స్మైల్‌ చేసింది, డైలీ ఫోర్‌ అవర్స్‌ నైట్‌ టాక్‌ చేసింది. ఇప్పుడు ‘హలో బ్రో’ అంటోంది’ అని నెత్తినోరూ కొట్టుకుంటుంటే... సింపుల్‌గా ‘ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌’ అనమంటారేం సార్‌? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
వెంటనే ఇంకో ఆన్సర్‌ ఇవ్వండి, లేదా నేను, అరటిపండు నిరసనకు దిగుతాము.’ ‘నా పొట్ట ఎందుకు కొడతావు నీలాంబరీ...? మనం ఒక అండర్‌స్టాండింగ్‌కి వద్దాం. మైక్‌ కూతలో ఒక సవరణ చేద్దాం.‘ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌... ఒక్క నా కాబోయే వైఫ్‌ తప్ప’ అని చెప్పమను నీలూ.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

ప్రాణం పోయినా అభివృద్ధి ఆగనివ్వను

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC