నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌


లవ్‌ డాక్టర్‌



హాయ్‌ సర్‌! నేను రెండు సంవత్సరాల క్రితం కువైట్‌కు వెళ్లాను. ఒక రోజు నాకు మా అత్త కూతురు(మా నాన్న పిన్నిగారి మనవరాలు) కాల్‌ చేసి నువ్వంటే ఇష్టం మా వాళ్లతో మాట్లాడు అంది. ఈ విషయం మా నాన్నకు చెప్పాను. నీ ఇష్టం అన్నారు. ఆ రోజు నుంచి మా ప్రేమ ఫోన్‌లోనే సాగింది. ఈ విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయి చనిపోతామని బెదిరించారు. ఓ రోజు తనే ఫోన్‌ చేసి ‘నన్ను మర్చిపో’ అని చెప్పింది. అలా వాళ్ల పెద్దవాళ్లే దగ్గరుండి చెప్పించారు.



దాంతో కువైట్‌లో ఉండలేక ఇండియా వచ్చేశాను. తరువాత తను నన్ను కలిసి ‘నేను నీకు పిన్నిని అవుతానట. అందుకే మా వాళ్లు పెళ్లి వద్దంటున్నారు’ అంది. మా నాన్నగారు వాళ్ల అక్క కూతురినే పెళ్లి చేసుకున్నారు. దాంతో నాకు మేనత్త కాస్తా అమ్మమ్మ అయిపోయింది. ఆ వరసలో మరదలు కాస్తా పిన్ని అయ్యింది. ‘‘మా వాళ్లు ఒప్పుకోకపోతే  వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం’’ అని గతంలో అన్న ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ఎందుకు మారిపోయిందో తెలియడంలేదు. నేను కనిపిస్తే పక్కనుంచి వెళ్లిపోతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇద్దరం కలిసేందుకు మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – శ్రీకాంత్‌


జీవితం సింపుల్‌గా ఉండాలని అనుకుంటాం కానీ... ఏంటో లైఫ్‌ ఎక్కడి నుంచి వచ్చి పొడుస్తోందో తెలియదు. పోనీ లైఫ్‌తో ఎలాగోలా మ్యానేజ్‌ చేద్దామంటే లవ్‌ ఎక్కడ నుంచి వచ్చి తాట తీస్తుందో చెప్పలేం. నీ బాధ అర్థమయినా ఈ పెళ్లి వద్దనే చెబుతా. ‘ఎందుకు సార్‌... మంచి కవిత్వం మొదలుపెట్టి... సడన్‌గా మేటర్‌లోకి వచ్చేశారు.’ లైఫ్‌ కొట్టుడులో... లవ్‌ కట్టడిలో నుంచి తప్పించుకున్నా, ఈ మ్యారేజ్‌లో ఇంకో ప్రాబ్లమ్‌ ఉంది శ్రీకాంత్‌. దగ్గర బంధువులలో పెళ్లిళ్లు జరిగితే పిల్లలకు కష్టాలు తప్పవు. అంతా మన మంచికే అనుకుని... మూవ్‌ ఫార్వర్డ్‌. ‘మరి ప్రేమించిన బాధను ఎలా దిగమింగాలి సార్‌’ సారీ శ్రీకాంత్‌! ఇలా చెప్పకూడదు కానీ తొక్కలో బాధని అరటిపండులా మింగేయాలి మా నీలాంబరిలా.

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌



ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top