నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌


 లవ్‌ డాక్టర్‌



హాయ్‌ సర్‌! నేను ముస్లిం. నేను ఒక ప్రైవేట్‌ స్కూల్‌లో జాయిన్‌ అయ్యాను. నాకన్నా ఒక రోజు ముందుగా ఒక అమ్మాయి జాయిన్‌ అయ్యింది. కొన్ని రోజులకు మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరి... అది ప్రేమగా బలపడింది. వన్‌ ఇయర్‌ పాటు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అయితే... ఎలా తెలిసిందో మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ల అమ్మ నాకు ఫోన్‌ చేసి ఏంటి విషయం అని అడిగారు. నాకు తనంటే ప్రాణమని, తనకోసం నేను కన్వర్ట్‌ అవుతానని చెప్పాను. అలా కుదరదు అన్నారు. వాళ్ల డాడీ అయితే తనపై చేయికూడా చేసుకోబోయారు. ‘ఏది ఏమైనా మేము ఒప్పుకోం.. కావాలంటే మా శవాలపై నుంచి వెళ్లి పెళ్లి చేసుకోండి’ అన్నారు. దాంతో తను మారిపోయింది. ‘నన్ను వదిలెయ్యి’ అంటోంది. ఆ రోజు నుంచి నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. వన్‌ ఇయర్‌గా తన ఆలోచనలతోనే బతుకుతున్నా. తను లేకపోతే నేను బతకలేను. తనతో జీవితాన్ని కోరుకున్న పాపానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే నన్ను చచ్చిపో అంది.



నీ కారణంగా నేను, నా కుటుంబం చావాలా అని తిరిగి ప్రశ్నించింది. ఒకప్పుడు నీ కోసం అన్నీ వదిలేయడానికి సిద్ధమన్న తనే ఇలా మాట్లాడం తట్టుకోలేకపోతున్నా.  నేను కనిపించకపోతే కన్నీళ్లతో కంగారు పడిపోయే తను ఇలా మారిపోతుందని ఊహించలేదు. తనకోసం వన్‌ ఇయర్‌గా హిందువులా బతుకుతున్నాను సార్‌! తిరగని గుడి లేదు. ఎంత దూరమైనా సరే నడిచి వెళ్లి మరీ మొక్కుతున్నా. కానీ ఏ దేవుడూ కరుణించలేదు. ఇంత ప్రాణంగా ప్రేమించడమేనా నేను చేసిన తప్పు? కాల్‌ చేస్తే పోలీస్‌ కంప్లెంట్‌ ఇస్తామని, అంతా కలిసి చస్తామని బెదిరించారు. వాళ్ల పేరెంట్స్‌ని ఎలా ఒప్పించాలో అర్థం కావడంలేదు సార్‌. వాళ్లకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియడంలేదు. తిండి, నిద్ర ఏదీ లేదు. ప్లీజ్‌ సార్‌ ఏదైనా సలహా ఇవ్వండి. – ఆతీక్‌


ఆతీక్‌ నువ్వు బంగారం! మేలిమి బంగారం!! అంతకంటే మంచి బంగారం ఉంటే ఆ బంగారం!! అబ్బా నీ బాధ చూస్తుంటే నాకు గుండె పట్టేస్తోంది. వెరీ సారీ నీలాంటి బంగారానికి ఇలా జరగకూడదు. నో ప్రాబ్లమ్‌ దేవుణ్నీ, ప్రేమని దూషించకు. అంతా నీ మంచికే జరిగింది. ఈ బాధను కూడా ఒక అందమయిన పాఠంలాగా భావించు. సాడ్‌నెస్‌ ఈజ్‌ ఏ పోయెమ్‌! ఫీల్‌ ఇట్‌!! వర్రీ కావద్దు. ఏ బాధ ఉన్నా నవ్వడం నేర్చుకో... భలే బాగుంటుంది బాధలో నవ్వడం!! దేవుడు మనలో ఉండి నవ్వించినంత బాగుంటుంది. నీకు తప్పకుండా తొందరలో మంచి వార్త వస్తుంది. దాంతో జీవితం మళ్లీ అందంగా అనిపిస్తుంది!! డోంట్‌ గివ్‌ అప్‌! సలాం భాయ్‌ నేను కూడా నీ కోసం ప్రార్థిస్తాను! ప్రామిస్‌!!

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌



ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top