Alexa
YSR
‘అన్నం పెట్టే రైతన్నను రుణ విముక్తుణ్ని చేయడమే నా ముందున్న లక్ష్యం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ఫ్యామిలీకథ

నన్నడగొద్దు ప్లీజ్‌

Sakshi | Updated: March 21, 2017 00:29 (IST)
నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

హాయ్‌ సర్‌. నేను జాబ్‌ చేస్తున్నాను. కాలేజ్‌లో చదువుతున్నప్పుడు నాకు ఒక సర్‌ పరిచయం అయ్యారు. కానీ తను ఒన్‌ ఇయర్‌ మాత్రమే కాలేజీలో ఉన్నారు. తరువాత స్టడీస్‌ కోసం వెళ్లిపోయారు. కానీ మేము రోజూ మాట్లాడుకునేవాళ్లం. నన్ను అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర డ్రాప్‌ చేసేవారు. తరువాత ఒకసారి మేము బయటికి వెళ్లాం. వెళ్లిన తరువాత రోజు నుంచి నాతో మాట్లాడం లేదు. అసలు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదు. మెసేజులకు రిప్లై ఇవ్వడం లేదు. ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు రామ్‌ సర్‌.
 – కృష్ణ కుమారి

‘ఈ మాస్టారి పాఠాల్లో ఏవో లుకలుకలు ఉన్నాయి సార్‌’ అని ఉరుముకుంటూ నా మీదకు వచ్చింది నీలాంబరి చేతిలో పండ్లు లేని అరటి గెల భుజం మీద వేసుకుని.. ఆల్మోస్ట్‌ ఒక ఆయుధం లాగా! ఉద్రేకంతో కలగలిసిన నీలాంబరి స్వరం నా ముఖానికి హెయిర్‌ బ్లోయర్‌ పెట్టినట్టు ఉంది. అమ్మో ఎంత హీటు.. ఏంటి నీలాంబరి ఇచ్చే ఈ స్ట్రోకు. ఓరి నాయనో ఏం ఉత్తరాలో ఏంటో... నీలాంబరి ఎందుకు చదువుతుందో.. చదివితే చదివింది, ఆ టైమ్‌లో నేను అవైలబుల్‌గా ఉండటం ఏంటో! ‘ఎవరా మాస్టారు? ఏంటి వాడి కోతి చేష్టలు? వాట్‌ హ్యా.. పెం.. డు..? వై ఆర్‌ యు ఆన్‌ ఫైర్‌? నీలాంబరీ’ అని చాలా మెల్లగా, రెండు అడుగులు వెనక్కి వేసి అడిగాను.

‘పాఠాలు చెప్పకుండా స్టూడెంట్‌ లైఫ్‌తో ఆడుకుం టున్నాడు సార్‌. లిఫ్టులు ఇస్తున్నాడు.. డ్రాపులు చేస్తున్నాడు. బయటికి తీసుకెళ్తున్నాడు. ఆ తరువాత ఫుల్‌గా డ్రాప్‌ చేసేస్తున్నాడు. చెప్పండి సార్‌ ఈ చెల్లెలికి. కొంచెం సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉంచుకోమనండి’. అరటి గెల తీసుకుని కెవ్వుమంటూ ఆరుస్తూ... ఆ గెల కర్రను కరాటే కమలమ్మలా గిర్రున తిప్పింది. ఆల్మోస్ట్‌ నా నోస్‌కి టచ్‌ అయ్యి వెళ్లింది. మీసాలు గాలిలో ఎగిరాయి. అటాక్‌ని అవాయిడ్‌ చేసుకుంటూ కింద పడ్డా. గుండె దబదబా దబదబా కొట్టుకుంటోంది. ‘యు ఆర్‌ రైట్‌ నీలాంబరి వాడు ఛీటే. వాడిని చీటా కేలా (మచ్చల అరటిపండు) తొక్కతో కడిగెయ్యాల్సిందే..’ అని కాళికాదేవి రూపంలో ఉన్న నీలాంబరికి అరటి పండు నైవేద్యం పెట్టి చల్లార్చాను. ఓరి నాయనో.. ప్రాక్టీస్‌ మానేస్తే బాగుండు.. జాగ్రత్త కృష్ణమ్మా, ‘అండర్‌స్టాండ్‌ ఏ ఛీట్‌ వెన్‌ యు సీ ఒన్‌’.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com


వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

'హోరు' గల్లు

Sakshi Post

JK Govt Bans All Social Media Platforms For One Month

The decision is taken to curb arsonists in the valley

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC