కాలేయాన్ని శుభ్రం చేద్దాం!
అధ్యయనం
కాలేయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక వ్యాధులను అరికట్టవచ్చు. అందుకు మూడు సులువైన మార్గాలు.. దేహానికి తగినంత నీటిని అందించాలి. మంచినీరు, గ్రీన్ టీ, తాజా పండ్ల రసాలు... సమృద్ధిగా తీసుకుంటే గాల్‌స్టోన్స్ ఏర్పడడాన్ని నివారించవచ్చు. రోజూ పసుపు తీసుకోవాలి... పసుపు వాపులను తగ్గించడంతోపాటు లివర్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, క్యాబేజ్, వెల్లుల్లి, నిమ్మ, బత్తాయి, కమలా వంటి పుల్లటి పండ్లు తప్పని సరిగా ఉండాలి. ఇవి దేహంలోని విషపూరిత వ్యర్థాలను నశింపచేస్తాయి.