ఈవెంట్లు


డిట్రాయిట్‌ వ్యాసరచన ఫలితాలు

డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి– యు.ఎస్‌.ఎ. నిర్వహించిన ‘తెలుగు సాహిత్య వ్యాసరచన’ పోటీల్లో చామర్తి మానస, జిజ్ఞాస సోమనాథం మొదటి బహుమతి (ఒక్కొక్కరికీ రూ.27,231) గెలుచుకున్నారు. రెండవ బహుమతి(రూ.17,232) జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి(విహారి), మూడవ బహుమతి(రూ.11,213) రెంటాల శ్రీవేంకటేశ్వరరావు గెలుచుకున్నారు.



రెండు పుస్తకాల ఆవిష్కరణ

భూతం ముత్యాలు కథల సంపుటి ‘దగ్ధం’, నాటకం ‘కులాటకం’ ఆవిష్కరణ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో జరగనుంది. ఆవిష్కర్త: ఎస్వీ సత్యనారాయణ. జి.వి.రత్నాకర్, అంబటి సురేంద్రరాజు, దెంచనాల శ్రీనివాస్, నిమ్మ బాబూరావు పాల్గొంటారు.



ఎడ్ల గురవారెడ్డి పురస్కారానికి

ఎడ్ల గురవారెడ్డి స్మారక పురస్కారం కోసం 2015, 16ల్లో ప్రచురించిన కవితా సంపుటాల 3 ప్రతులను ఆగస్టు 31లోపు పంపాల్సిందిగా వెన్నెల సాహితి సంగమం,సిద్దిపేట కోరుతోంది. చిరునామా: కొండి మల్లారెడ్డి, 19–61/5/సి, విద్యానగర్, రోడ్‌ నం. 3, కుషాల్‌ నగర్, సిద్దిపేట–502103. ఫోన్‌: 9441905525

 

బి.ఎస్‌.కు పల్లేరు పురస్కారం

పల్లేరు స్వయంప్రభ సాహితీ పురస్కారాన్ని బి.ఎస్‌.రాములుకు ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలోని స్వర్ణ గార్డెన్స్‌లో ప్రదానం చేయనున్నారు. దేవులపల్లి ప్రభాకర్‌రావు, టి.రంగస్వామి, పసునూరి దయాకర్, జి.గిరిజా మనోహర్‌బాబు, చల్లా ధర్మారెడ్డి, బన్న అయిలయ్య పాల్గొంటారు. ఇందులోనే ఏరుకొండ శశిరేఖ కథాసంపుటి ‘పల్లె పిలుస్తుంది’ని పత్తిపాక మోహన్‌ ఆవిష్కరిస్తారు.



మిర్గం ఆవిష్కరణ – పురస్కారం

తెలంగాణ కవుల కవితా సంపుటి ‘మిర్గం’ ఆవిష్కరణ ఆగస్టు 27న సాయంత్రం 5:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఇందులోనే, తెలంగాణ సాహిత్య కళావేదిక వార్షిక పురస్కారాన్ని వనపట్ల సుబ్బయ్యకు ప్రదానం చేయనున్నారు. ఏనుగు నరసింహారెడ్డి, ఘంటా చక్రపాణి, రాజేందర్‌ జింబో, నాళేశ్వరం శంకరం, యాకూబ్, అమ్మంగి వేణుగోపాల్‌ పాల్గొంటారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top