కారు కొంటేనే మంచి భర్త!

కారు కొంటేనే మంచి భర్త!


మగోడు

 

మా పక్కింటి వాళ్లు సంపన్నులు. మా బంధువులలో కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఏ కొత్త వస్తువు చూసినా ‘‘అది మన ఇంట్లో ఉండాల్సిందే’’ అని పట్టుపడుతుంది మా ఆవిడ.

 

 మంచి భర్త అంటే ఎవరు? అనే ప్రశ్నకు-

 ‘‘పువ్వులో పెట్టి చూసుకునేవాడు’’ అనే సమాధానం వినిపిస్తుంటుంది. నేను అక్షరాల అలాంటి భర్తనే. ఏ రోజూ నా భార్యను చిన్న మాట కూడా అనలేదు. కానీ ఆమె దృష్టిలో నేను అసమర్థుడిని. దీనికి కారణం ఆమె గొంతెమ్మ కోరికలు.

 మా పక్కింటి వాళ్లు సంపన్నులు. మా బంధువులలో కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ల ఇంట్లో ఏ కొత్త వస్తువు చూసినా ‘‘అది మన ఇంట్లో ఉండాల్సిందే’’ అని పట్టుపడుతుంది మా ఆవిడ. ‘‘అదెలా కుదురుతుంది? వారి స్థాయి ఎక్కడ? మన స్థాయి ఎక్కడ? ఉన్నంతలోనే సర్దుకుపోవాలి’’ అని చెప్పినా ఒక పట్టాన వినదు.

 ఒకరోజు మా ఆవిడ వాళ్ల అక్క, ఆమె భర్త మా ఇంటికి వచ్చారు.

 ‘‘మీ బావ కారు కొనడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇంక రెండు నెలల్లో మా ఇంటికి కారు వస్తుంది’’ అని మా ఆవిడతో చెప్పింది వాళ్ల అక్క.

 ఇక అది మొదలు...‘కారు కొనండి’ అని రోజూ పోరు..!

 ఒకోసారి తట్టుకోలేనంత కోపం వస్తుంది. అయినా నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను. మనశ్శాంతి కోసం యోగా కూడా చేస్తున్నాను. నా భార్య కళ్లు తెరిపించాల్సిందని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

 

 - జీవిఆర్, ఖమ్మం

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top