సోరియాసిస్ సమస్యకు హోమియోకేర్ పరిష్కారం

సోరియాసిస్ సమస్యకు హోమియోకేర్ పరిష్కారం


 చలికాలం రాగానే చాలామంది చర్మ సంబంధిత రోగులలో వ్యాధి తీవ్రత పెరిగి వైద్యుని దగ్గరకు పరుగులు తీస్తుంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య ‘సోరియాసిస్’. చాలామంది రోగులు ఇది సాధారణ చర్మవ్యాధి అనుకుంటారు. కాని ఇది రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మ సంబంధిత వ్యాధి అని చాలా తక్కువమందికి తెలుసు. కనుక ‘సోరియాసిస్’ వచ్చిన రోగులలో జబ్బును కేవలం పై పూతలతోనే నయం చేయలేం.

 

 ప్రపంచ జనాభాలో సుమారుగా 3 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగి మరణానికి దారి తీయదు. కాని రోగి ఈ జబ్బుతో సంవత్సరాల తరబడి బాధపడటం వలన ఇది సామాజిక రుగ్మతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది.

 

 సోరియాసిస్ అంటే...

 సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా కొనసాగే చర్మవ్యాధి. ఇందులో ముఖ్యంగా చర్మంపై దురదలతో కూడుకున్న వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి.సోరియాసిస్‌లో ముందుగా చర్మం ఇన్‌ఫ్లమేషన్‌కు గురి అయి ఎర్రగా మారి క్రమంగా చర్మం వెండి రంగు పొలుసుల రూపంలో రాలిపోవడం జరుగుతుంది. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అధికమవుతాయి.

 

 ఈ వ్యాధి చర్మంతో పాటు గోళ్ళు, కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతుడి చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరంగా తయారవుతాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పైపొరగా ఏర్పడిన కణాలు క్రమేణా నిర్జీవమై పొలుసులుగా రాలిపోయి కింది కణాలను బహిర్గతం చేస్తాయి. కాని రోగనిరోధక శక్తి వికటించి శరీర కణాలపై దాడి చేయడం వలన వచ్చే సోరియాసిస్ వ్యాధి వలన ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మకణాలు వేగంగా తయారై 3-4 రోజులకే వెలుపల పొరకు చేరుకుంటాయి. ఈ విధంగా పైకి చేరిన కణాలు వేగంగా చనిపోవడం, కొత్త కణాలు లోపల నుండి ఏర్పడటం ... ఈ మొత్తం ప్రక్రియ త్వరత్వరగా పూర్తి కావడం వలన వెలుపలి పొర ఊడిపోక ముందే కొత్త పొర రావడం వలన చర్మం పొలుసులుగా రాలిపోతుంది.

 

 కారణాలు: సోరియాసిస్‌కు గల కారణాలు జన్యుపరమైన కారణాలు లేక మానసిక ఒత్తిడి వలన కాని రావచ్చు అని అనుభవ పూర్వకంగా తెలుస్తోంది. రోగ నిరోధక వ్యవస్థలోని అసమతుల్యతల వలన కూడా రావచ్చు. దీర్ఘకాలికంగా కొన్నిరకాల మందులు వాడటం వలన ‘సోరియాసిస్’ జబ్బు రావచ్చు.

 రకాలు

 

     సోరియాసిస్ వల్గారిస్: ఇది సాధారణంగా కనిపించేదే. స్కిన్‌పై ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొలుసుగా మారడం దీని ప్రధాన లక్షణం.

 

     గట్టేట్ సోరియాసిస్: ఇది సాధారణంగా పిల్లలలోనూ, యుక్త వయస్కులలోనూ వస్తుంది. దీనిలో చర్మంపై చిన్న పొక్కులు, ఎర్రని మచ్చలు వస్తాయి మొదటి దశలో ఉండగానే చికిత్స ప్రారంభిస్తే దీన్ని సంపూర్ణంగా నయం చేయవచ్చు.

 

     పస్చులర్ సోరియాసిస్: ఇది అరుదుగా కనిపించే సోరియాసిస్ రకం. దీనిలో సాధారణంగా చర్మంపై చీముతో నిండిన పొక్కులు కనిపిస్తాయి.

 

     ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్: ఇది కొంచెం ప్రమాదకరమైన దే. ఇది శరీరంలో చాలా భాగం చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిలో పొలుసులు పెద్దగా ఊడిపోతాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే శరీరంలో ఉండే ధాతువుల్లో అసమతుల్యత చోటు చేసుకోవడం, ప్రొటీన్‌లు కోల్పోవటం జరుగుతుంది.

 

 ఇన్వర్స్ సోరియాసిస్: ఇది ముఖ్యంగా చర్మం మడతలలో వస్తుంది.

 కాంప్లికేషన్స్:  సోరియాటిక్ ఆర్థరైటిస్ ఊ మానసిక అశాంతి,  ఊలవణాలు, విటమిన్ లోపాలకు దారి తీస్తుంది.

 

 తీసుకోవలసిన జాగ్రత్తలు  

 ఊ అధికంగా నీరు తాగడం ఊ అధికంగా ప్రొటీన్లు కల ఆహారాన్ని తీసుకోవడం ఊ చర్మం పొడి బారకుండా కొబ్బరినూనె, మాయిశ్చరైజర్ రాయడం ఊ పొడి చేసిన అవిశ గింజలను రోజూ తీసుకోవడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచడానికి కావలసిన ఒమెగా 3 కొవ్వు ఆమ్లం సోరియాసిస్‌ని కొంత వరకు అదుపులో ఉంచవచ్చు ఊ రోజూ వ్యాయామం చేయడం ఊ రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం ఉండటం. సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి. పొలుసులు ఏర్పడటం తగ్గిస్తుంది ఊ చలికాలం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, కొన్ని ఇతర ఔషధాల వలన వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.

 

 నిర్థారణ పరీక్షలు : ఊ సీబీపీ ఊ ఈఎస్‌ఆర్ ఊ స్కిన్ బ్లాప్సీ ఊ కీళ్లను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేస్తారు.

 

 హోమియో చికిత్స: చాలామంది సోరియాసిస్ రోగులు ఆత్రుతతో వైద్యులను, వైద్య విధానాలను త్వరగా మారుస్తూ ఉంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. సోరియాసిస్ వైద్యం తీసుకునే రోగి ఏదో ఒక వైద్య విధానాన్ని ఎంచుకొని దీర్ఘకాలం ఓపికగా వైద్యం చేయించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

 హోమియోకేర్ ఇంటర్‌నేషనల్‌లో జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ సిమిలిమం విధానం ద్వారా, సోరియాసిస్ రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోని వికటించిన రోగ నిరోధక వ్యవస్థను సరిచేసి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు.

 

 లక్షణాలు

 సోరియాసిస్ తల, మోచేతులు, మోకాళ్ళు, అరి చేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావితం చేస్తుంది ఊ చర్మం ఎర్రబడటం ఊ సాధారణ నుండి అతి తీవ్రమైన దురద ఊ చర్మంపై వెండిరంగు పొలుసులు ఊడిపోవడంఊ సోరియాసిస్ తలలో ఉన్నప్పుడు పొలుసులు రాలడంతో పాటు జుట్టు రాలిపోవడం ఊ అరిచేతులు, అరిపాదాలు చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పగలడం వలన తీవ్రమైన నొప్పి ఉండవచ్చు ఊ సోరియాసిస్ గోర్లను ప్రభావితం చేస్తే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి ఊ సోరియాసిస్ వ్యాధి తీవ్రంగా ఉండే కీళ్లను ప్రభావితం చేసి కీళ్లనొప్పులకు దారి తీస్తుంది.

 

 డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి.,

 హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్

 ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99

 టోల్ ఫ్రీ: 1800 102 2202

 బ్రాంచ్‌లు:  హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top