కుటుంబంతో ఖుషీగా!

కుటుంబంతో ఖుషీగా!


సమయం, డబ్బు ఆదా అవడానికి.. కుటుంబమంతా కలిసి పర్యటనను ఆనందించడానికి కొన్ని సూచనలు..

వెళ్లిన చోట ఉండే హోటళ్లు, చూడాల్సిన ప్రదేశాలను ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రయాణ మార్గంలో ఆహారపదార్థాలు దొరకనప్పుడు పిల్లలు ఆకలికి తట్టుకోలేరు. వెంట కావల్సిన పదార్థాలు, అలసటగా ఉంటే పడుకోవడానికి వీలుగా దుప్పటి, దిండు వంటివి వెంట తీసుకెళ్లాలి.



 పిల్లలు ఉపయోగించేందుకు అనువైన కెమెరాను ఇచ్చి, చుట్టుపక్కల ప్రదేశాలను ఫొటోలను తీసేలా ప్రోత్సహించాలి. దీని వల్ల పిల్లలు ఆనందంగా, కొత్త వాతావరణాన్ని గమనించడంలో బిజీగా ఉంటారు.  వెళ్లబోయే చోట వాతావరణానికి తగ్గ దుస్తులు ముందే సిద్ధం చేసి తీసుకెళ్లాలి. అతి చల్లని ప్రదేశాలు అయితే చేతులకు గ్లౌజ్, పాదాలకు బూట్లు, ఇతర ఉన్ని దుస్తులు తప్పనిసరి.

 

పిల్లలకు ఇష్టమైన బొమ్మలు, ఇంటర్‌నెట్ యాప్స్, క్రేయా న్స్, వైట్ షీట్స్.. వెంట తీసుకెళితే వారిని ప్రయాణంలోనూ బిజీగా ఉంచవచ్చు.  క్రమం తప్పకుండా వేసే మందులతో పాటు వాతావరణ మార్పుల వల్ల పిల్లలను తరచూ విసిగించే జలుబు, దగ్గు వంటి వాటికి ప్రయాణానికి ముందే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తీసుకోవాలి.



{పయాణంలో పిల్లల నోళ్లు మూయించడానికి చాక్లెట్లు, ఇతర వేపుడు, తీపి పదార్థాలను తినిపించకూడదు. ఆరోగ్యకరమైన చీజ్ క్యూబ్స్, బ్రెడ్ స్టిక్స్, పండ్లు.. వంటివి వెంట తీసుకెళ్లాలి.    పర్యటనలో విభిన్నరకాల ఆహారపదార్థాలను రుచి చూడటం, వెళ్లిన ప్రాంతపు పోస్టల్ స్టాంప్స్ సేకరించడం, అక్కడి గ్రంథాలయాలను సందర్శించడం వంటివి పిల్లలకు పరిచయం చేస్తే వారి జ్ఞాపకాలలో అవి పదిలంగా నిలిచిపోతాయి.   మార్గమధ్యంలో ఇంటర్నెట్‌లో తమ స్నేహితులతో మాట్లాడుకోవడాన్ని ప్రోత్సహించవచ్చు. చుట్టుపక్కల ప్రదేశాల గురించి అవతలివ్యక్తులతో పంచుకోవడం కూడా ఈ  ప్రయత్నం వల్ల సులువవుతుంది.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top