శ్రద్ధాకపూర్ - శంకరాభరణం!

శ్రద్ధాకపూర్ -  శంకరాభరణం!


గాసిప్

 


తన గాన మాధుర్యంతో తండ్రి శక్తి కపూర్‌ను మరోసారి ఆనందపరిచింది శ్రద్ధా కపూర్. తండ్రి పుట్టిన రోజున... ఉదయమే ఆయనకు ఎదురెళ్లి లివింగ్ రూమ్‌లో పియానో వాయిస్తూ పాట పాడింది.



‘‘నా కూతురు అని చెప్పడం కాదుగానీ, సంగీతంలో శ్రద్ధకు మంచి ప్రతిభ ఉంది. మా అమ్మాయి గదిని మ్యూజిక్‌రూమ్ అనవచ్చు’’ అని చెప్పుకొచ్చాడు శక్తికపూర్. మన ‘శంకరాభరణం’లాంటి మ్యూజిక్ సబ్జెక్ట్‌తో మాంచి సినిమా ఒకటి చేయడానికి శ్రద్ధ కసరత్తు చేస్తోందట. సంగీతం నేపథ్యంతో వచ్చిన సౌత్ సినిమాల గురించి కూడా ఆరాతీస్తోందట! ఆమె కల ఫలిస్తుందో లేదో వేచిచూద్దాం.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top