పెళ్లి పిలుపు సప్తకళ


బంగారురంగు

వస్త్రాలంకరణ పెళ్లిలో జిలుగు వెలుగులను కురిపిస్తుంది. మేనిరంగు నిగారింపుగా కనిపిస్తుంది. అందుకే, ప్రఖ్యాతిగాంచిన డిజైనర్లు సైతం ఈ రంగు వస్త్రాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.




పెళ్లికూతురు, పెళ్లికొడుకు

ఎలాగూ ఏడడుగులు వేస్తారు.

అగ్నిహోత్రం చుట్టూ వేస్తే

ఈ పవిత్రమైన సప్తపది

ఏడుజన్మల బంధానికి మొదటి అడుగు అవుతుంది.

మరి పెళ్లికొచ్చిన అమ్మాయిలు

సరదాగా,

చలాకీగా,

అందంగా,

అనందంగా,

ఏడు హంగులూ

ఏడు రంగులతో ముస్తాబై

పెళ్లికి వెళితే

అది సంతోషాల ఆహ్వానమే!




ఏ చిన్న పార్టీ అయినా ఎప్పుడూ ఎవర్‌గ్రీన్‌ అనిపించే వస్త్రాలంకరణ శారీ! ‘పట్టుచీర కట్టుకోవాలా!’ అంటూ ఇబ్బంది పడే అమ్మాయిలు సింపుల్‌గా అనిపించే ఇలాంటి లైట్‌వెయిట్‌ పట్టు చీర కట్టుకుంటే వేడుకలో ‘సూపర్బ్‌’ అనే ప్రశంసలు మీకే!



కొంతమంది అమ్మాయిలు కంఫర్ట్‌గా ఉండే డ్రెస్‌లను ఇష్టపడతారు. వాటిలో ధోతీ ప్యాంట్, షార్ట్‌ కుర్తీ సరైన ఎంపిక. వేడుకలకు హెవీ డిజైన్స్‌ ఇష్టపడని నవతరం గర్ల్స్‌ ఈ తరహా డ్రెస్సింగ్‌తో హైలైట్‌గా నిలిచిపోవచ్చు.



లాంగ్‌ స్కర్ట్‌ మీదకు ఓవర్‌ కోటులా ఉండే డిజైనర్‌ టాప్‌ ధరిస్తే పెళ్లిలో ఇలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇప్పుడు ఇది ట్రెండ్‌లో ఉన్న ఫ్యాషన్‌. ఈ తరం అమ్మాయిలు కోరుకునే పార్టీవేర్‌గానూ ఈ డ్రెస్‌ ముందు వరసలో ఉంది.



ప్రెట్టీ లుక్‌తో ఆకట్టుకోవాలంటే క్రీమ్‌ లేదా వైట్‌ లాంగ్‌ లెహంగా దాని మీదకు పూర్తి కాంట్రాస్ట్‌ క్రాప్‌టాప్‌ వేసుకుంటే చాలు. వేడుకలో యువరాణిలా మెరిసిపోవచ్చు.



ఇంకా సింపుల్, కంఫర్ట్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేయాలంటే అనార్కలీ డ్రెస్‌ వేసుకొని, దానికి మీదకు డిజైనర్‌ ఓవర్‌ కోట్‌ ధరిస్తే చాలు. ‘మార్వలెస్‌’ అనే కితాబు ఇట్టే కొట్టేస్తారు.



హరివిల్లులో ఏడురంగులున్నట్టే ధరించే డ్రెస్‌లోనూ ఆ హంగులు ఉండేలా చూసుకుంటే వేడుకలో మల్టీకలర్స్‌తో చూపరుల మతులు పోగొట్టవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top