మీలో ఊహాశక్తి ఉందా?

మీలో ఊహాశక్తి ఉందా?


సెల్ఫ్‌ చెక్‌



సృజనాత్మకతకు తొలి మెట్టు ఊహ. దీనిద్వారానే అభివృద్ధి సాధ్యం. కథ చదివేటప్పుడు కొందరు ఆయా సీన్‌లను ఊహించుకుంటూ చదవగలరు. మరికొందరికి అలాంటి శక్తి తక్కువ. మీలో ఇమాజినేషన్‌ పవర్‌ ఉందోలేదో ఒకసారి చెక్‌ చేసుకోండి.



1.    విషమిస్తున్న పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు.

ఎ. కాదు     బి. అవును



2.    మీ ఆలోచనలనలతో ఒక పుస్తకం రాయవచ్చు.

ఎ. కాదు     బి. అవును



3.    మీరు చదివిన కథను మార్చి కొత్తగా చెప్పగలరు.

ఎ. కాదు     బి. అవును



4.    అసమాన పరిస్థితులు మీ ఊహల్లో ఉంటాయి.

ఎ. కాదు     బి. అవును



5.    కావలసిన వాళ్లు సమయానికి రాకపోతే వారు ఎక్కడికి వెళ్లివుంటారో గెస్‌ చేయగలరు.

ఎ. కాదు     బి. అవును



6.    ఆబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్స్‌ను ఇష్టపతారు.

ఎ. కాదు     బి. అవును



7.    ఫిక్షన్, అతీంద్రియ కథల పుస్తకాలను ఇష్టపడతారు.

ఎ. కాదు     బి. అవును



8.    ఏ పని చేయాలన్నా దాని పర్యవసానాలను అంచనా వేయగలుగుతారు.

ఎ. కాదు     బి. అవును



‘బి’ లు ఆరు దాటితే మీలో ఊహాశక్తి ఉంటుంది. దీనివల్ల ప్రయోజనాలు పొందుతారు. ‘ఎ’ లు ఎక్కువగా వస్తే మీలో ఇమాజినేషన్‌ పవర్‌ తక్కువనే చెప్పాలి. కథలు చదవడం, రాయటం, విషయాల పట్ల క్యూరియాసిటీ పెంచుకోవటం ద్వారా ఊçహాశక్తిని పెంచుకోవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top