మళ్లీ వస్తున్న ‘యోగా’ పాండే...

మళ్లీ వస్తున్న  ‘యోగా’ పాండే... - Sakshi


పూనమ్ యోగం

 

పోతపోసిన సౌందర్యం... యోగాసనాల బాట పట్టింది. అయితేఆధ్యాత్మిక భావనలు మేలుకొల్పుతూ ఆరోగ్యసాధన చేయించే సహజసిద్ధమైన యోగాకు ఇది విభిన్నం. ఆమె యోగా వీడియో ఒక ఆనందసారం. సమ్మోహనాస్త్రం. ఆమె ఇప్పుడు తెలుగు నటి కూడా.

 ఆమె పూనమ్ పాండే.



మాలిని అండ్ కో సినిమా ద్వారా మనకు పరిచయమైన బ్యూటీ క్వీన్ పూనమ్ పాండే క్రికెట్ మ్యాచ్ గెలిస్తే న్యూడ్‌గా కనిపిస్తా అనే ప్రకటనతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత టీనేజ్ కుర్రాడితో ఆమె చేసిన నషా సినిమా ఓ సంచలనం. గ్లాడ్‌రాగ్స్ పోటీలు వేదికగా గ్లామర్ రంగంలోకి అరంగేట్రం చేసిన పూనమ్ సృష్టించిన సంచలనాలన్నీ ఒకెత్తయితే తను రిలీజ్ చేసిన యోగా వీడియో ఒక్కటే ఒకెత్తు.


 


వంపు సొంపుల ప్రదర్శన సహితంగా పూనమ్ రూపొందించిన యోగాసనాల వీడియో ఇంటర్నెట్లో ఈ వీడియో హాట్ టాపిక్ అయిపోయింది. మొత్తం మీద యోగా తోడుగా పూనమ్ పాపులారిటీ మరింత పెరిగింది. తన తొలి యోగా వీడియోకి వచ్చిన స్పందనతో మురిసిపోయిన పూనమ్ మరో యోగా వీడియో రూపొందిస్తానని అప్పుడే ప్రకటించింది. ఇప్పుడామె ఆ వీడియో చిత్రీకరణ పూర్తయిందని, దానిని రేపే విడుదల చేయనున్నానని తాజాగా ట్వీట్ చేసింది. తొలి వీడియో చిలకరించిన ఆనందానుభూతుల్ని నెమరువేసుకుంటున్న పూనమ్ అభిమానులు రెండో వీడియో కోసం ఇంకెక్కువ రోజులు నిరీక్షించనక్కర్లేదు.



 ఎందరో సాధకులు... కొందరే శిక్షకులు

 పూనమ్ ఒక్కరనే కాదు... అసలు యోగా సాధన అనేది ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. కరీనా, సోనమ్, బిపాసా... తదితర సీనియర్ స్టార్ హీరోయిన్స్ దగ్గర నుంచి నిన్నకాక మొన్న వచ్చిన ఆలియాభట్ వంటి క్యూట్ గాళ్స్ దాకా ప్రతి ఒక్కరూ యోగా స్మరణం చేస్తూన్నారు. తమ సౌందర్య రహస్యం ఆసనాలే అంటూ స్పష్టం చేస్తున్నారు. విపరీతమైన ఒత్తిడికి లోను చేసే సినీ పరిశ్రమలో యువతులకు అత్యంత విశ్వసనీయ నేస్తంగా సేదతీర్చే సాధనంగా యోగా స్థిరపడిపోయింది. దాదాపు అందరు హీరోయిన్లూ యోగా సాధనలో మునిగితేలుతున్నప్పటికీ... కొందరు మాత్రమే శిక్షకులుగా మారి వీడియో, డీవీడీలు రూపొందించి విడుదల చేస్తున్నారు.


 


ఈ ట్రెండ్‌కు మన దగ్గర శ్రీకారం చుట్టింది బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి. మూడున్నర పదులు వయసు దాటుతున్నా చెక్కు చెదరని అందంతో మెరిసిపోయే సార్థక నామధేయురాలైన శిల్ప రిలీజ్ చేసిన డీవీడీ మంచి హిట్ అవడంతో మరికొందరు కూడా అదే బాట పట్టారు. అలాంటివారిలో చెప్పుకోవాల్సిన పేరు లారాదత్తా. బ్యూటీ క్వీన్ కిరీటంతో సినీరంగంలోకి ప్రవేశించిన లారా... యోగా డీవీడీ కూడా మంచి హిట్టయింది. సహజంగానే అందమైన అమ్మాయిలు యోగాసనాలు సాధన చేయడంలో ఉన్న అందం ఈ వీడియోలకు ప్లస్‌గా మారుతోంది. అయితే వీరి వీడియోల కన్నా మరింత హాట్‌గా రూపొందించి లాంచ్ చేస్తోంది పూనమ్.  



 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top