సెంచరీ కవలలు

సెంచరీ కవలలు


తిక్క లెక్క

 

ఫొటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరూ కవలలు. వీళ్ల పేర్లు పీటర్ లాంగరాక్, పాలస్ లాంగరాక్. బెల్జియంలో ఉంటారు. ప్రపంచంలో సెంచరీని పూర్తిచేసిన వయోవృద్ధులు చాలామందే ఉన్నా, సెంచరీ పూర్తి చేసుకున్న కవలలు మాత్రం వీళ్లిద్దరే. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ, అన్ని పనులూ చేసుకోగలుగుతున్నారు. ఇటీవలే తమ 102వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు.



విశేషం ఏమిటంటే, ఈ కవలలిద్దరూ బ్రహ్మచారులే. అమ్మాయిల వెంట పడకపోవడం, మితంగా తినడం, క్రమం తప్పకుండా రోజూ వైన్ పుచ్చుకోవడం తమ ఆరోగ్య రహస్యాలని వీళ్లు చెబుతున్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top