ఆగస్టు 31 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఆగస్టు  31 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు


ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:

జవగళ్ శ్రీకాంత్ (మాజీ క్రికెటర్), యువన్ శంకర్‌రాజా (సంగీత దర్శకుడు)


 

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. కాబట్టి వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది.  లాభాలు కళ్లజూస్తారు. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలై ఈ సంవత్సరం జాబ్‌లో చేరే అవకాశం ఉంది. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆదాయం బాగుంటుంది. యోగ, ఆరోగ్య విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. వీరు పుట్టిన తేదీ 31 రాహు సంఖ్య కావడం వల్ల స్నేహితులతో, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రీన్‌కార్డ్ కోసం చూస్తున్న ఎదురు చూపులు ఫలిస్తాయి. కంప్యూటర్, సైన్స్ రంగాలలోని విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి.



అయితే చంద్రుని ప్రభావం వల్ల ఆలోచనలలో నిలకడ ఉండక మానసికంగా కొంత దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం.  లక్కీ నంబర్స్: 2,4, 5,6,7; లక్కీ కలర్స్: బ్లూ, వైట్, సిల్వర్, రెడ్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, శుక్ర, శనివారాలు; సూచనలు: రోజూ రాత్రిపూట వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, రాహుజపం చేయించడం, అనాథ శరణాలయాలు, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది.

 - డాక్టర్ మహమ్మద్ దావూద్

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top