సెట్‌లోకి సూర్యుడొచ్చాడు!

సెట్‌లోకి సూర్యుడొచ్చాడు!


ఎక్కడొచ్చాడు? అసలు ఆకాశమంతా మేఘాలు, చిన్ని చిన్ని చినుకులు, వర్షాలు... వీటి మధ్యలో సూర్యుడికి చోటేది? ఆయన ఇంట్లోకి, సెట్‌లోకి వచ్చే దారేది? అనేగా మీ డౌటు! ఇక్కడ చెబుతున్నది ఆకాశంలో సూర్యుడి గురించి కాదు, వక్కంతం వంశీ సెట్‌లో సూర్య గురించి. అల్లు అర్జున్‌ హీరోగా లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సూర్య పాత్రలో నటిస్తున్నారు.


శుక్రవారం అల్లు అర్జున్‌ ఈ సెట్‌లోకి ఎంటరయ్యారు. ఇప్పుడు జరుగుతున్నది సెకండ్‌ షెడ్యూల్‌. హీరో లేకుండానే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేశారు. త్వరలో హీరోయిన్‌ అనూ ఇమ్మాన్యుయేల్‌ కూడా షూటింగ్‌లో పాల్గొంటారట. హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంటే... వీకెండ్స్‌లో ముంబైలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. విశాల్‌–శేఖర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో పాటలు రాయడానికి రామజోగయ్య శాస్త్రి, ఆయనతో దర్శకుడు శనివారం ఉదయం ముంబై వెళ్లారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top