యోగాయుష్మాన్‌ భవ

యోగాయుష్మాన్‌ భవ


యోగా ప్రాచీన విద్య. ఆ యోగాలో ప్రస్తుతం అతి ప్రాచీన గురువు తావో పోర్సాన్‌ లించ్‌. ఆమె వయసు 98 సంవత్సరాలు. గిన్నెస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోకి ఎక్కిన ఈ గురువు ఈ వయసులోనూ దేశదేశాలు తిరుగుతూ యోగ విద్యను బోధిస్తున్నారు. యోగా ప్రాముఖ్యాన్ని చెబుతున్నారు. అసలైతే తావో పోర్సాన్‌ లించ్‌ పని గట్టుకుని యోగా గొప్పతనం గురించి చెప్పనవసరం లేదు. ఆమెను చూస్తే చాలు. వెంటనే మన మనసు యోగాసనం వేస్తుంది.



ఆ వెంటనే మన దేహం! ఫ్రాన్స్‌ సంతతికి చెందిన ఈ యోగేశ్వరి పుట్టింది పాండిచ్చేరిలో. దీన్ని బట్టి మీకేమర్థమవుతోంది? యోగా గురువుగా ఈమె ఎన్ని దేశాలు తిరిగినా, ఆ పేరు ప్రఖ్యాతులన్నీ మన దేశానికే. రెండు రోజుల క్రితమే తావో పోర్సాన్‌... హార్ట్స్‌డేల్‌లో (యు.ఎస్‌) యోగా క్లాసులు తీసుకుని వచ్చారు. ఇక ఆమెకు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నుండి ఆహ్వానం అందడమొక్కటే తరువాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top