వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ

వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ - Sakshi


హుస్నాబాద్‌రూరల్/చిగురుమామిడి/కోనరావుపేట, న్యూస్‌లైన్: జిల్లాలో వైఎస్సార్‌సీపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మేనిఫెస్టోను పరిశీలిస్తున్న ప్రజలు పార్టీకి చేరువవుతున్నారు. దివంగత మహా నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పాలన తిరిగి రావాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాల్సిందే అంటున్నారు. యువకులు, విద్యావంతులు, మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఆదివారం హుస్నాబాద్ మండలం నందారంలో సుమారు వంద మంది గిరిజనులు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

 

చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మీసాల రాజారెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా వారి సమక్ష్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరిలో చట్ల సంతోష్,పి.సంతోష్, శ్రీనివాస్, కొలిపాక నాగరాజు, శ్రీకాంత్, నాగరాజు, రాజు, అశోక్, అజయ్, శివరామకృష్ణ, సురేశ్, అనీల్, చంద్రయ్య, నర్సయ్య తదితరులు ఉన్నారు. రాజన్న రాజ్యం వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని వారు అభి ప్రాయపడ్డారు.  కోనరావుపేట మండలం వట్టిమల్ల, ధర్మారం గ్రామాల్లో సుమారు 350 మంది యువకులు వైఎస్సార్‌సీపీ వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి ముస్కు వెంకటరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

 

బీళ్లకు నీళ్లు మళ్లించిన వైఎస్

మెట్టప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీడు భూములకు నీళ్లు మళ్లించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని నందారం, మడద, రాములపల్లిలో ప్రచారం నిర్వహించారు.



వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల పను లు వేగవంతం చేశారన్నారు. ఆయన మరణానంతరం తట్టెడు మట్టి కూడా పోయలేదని ఆవేదన చెందారు. అందుకే ఈ ప్రాంత ప్రజలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు.  నేదూరి మహేశ్, జక్కుల మహేశ్, నూనె నగేశ్, శేఖర్,  రమేశ్, శ్రీనివాస్‌గౌడ్ శ్రీనివాస్‌గౌడ్ తదతరులు పాల్గొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top