‘ఖేడ్’.. ఫ్యాన్’ స్పీడ్


నారాయణఖేడ్, న్యూస్‌లైన్: నారాయణఖేడ్‌లో ‘ఫ్యాన్’ గాలి వీస్తోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి అప్పారావు షెట్కార్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల కంటే ముందంజలో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలే అండగా.. ప్రజా సమస్యలే ఎజెండా గా ప్రచారం చేపడుతున్నారు. కాగా ఈ నెల 21న షర్మిలమ్మ నిర్వహించిన రోడ్‌షోతో ఖేడ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా దూసుకెళుతోంది.



షర్మిల రోడ్‌షోతో కార్యకర్తల్లో, వైఎస్సార్ అభిమానుల్లో ఎనలేని ఉత్సాహం నింపగా.. ఇన్నాళ్లు తటస్థంగా ఉన్న వైఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులు ఒక్కసారిగా అప్పారావు షెట్కార్‌కు తమ మద్దతు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీలు కంగుతినే పరిస్థితి కనిపిస్తోంది. షర్మిల రోడ్‌షోకు ఆయా గ్రామాల నుంచి భారీగా జనాలు రావడమే ఇందుకు నిదర్శనమని ఖేడ్ ప్రజలు పేర్కొంటున్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రతిపక్ష పాత్ర కరువైంది. ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.



ఓ వర్గంలోని కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. నియోజకవర్గంలోని కంగ్టి, మనూరు, నారాయణఖేడ్‌లో అన్ని గ్రామాల్లో వైఎస్సార్ సీపీ క్యాడర్ పటిష్టంగా ఉండగా కల్హేర్, పెద్దశంకరంపేటల్లో రోజురోజుకూ ముమ్మరంగా చేరికలు జరుగుతున్నాయి. కాగా మైనారిటీ, దళిత, క్రిస్టియన్, లింగాయత్ నాయకులు అప్పారావ్ షెట్కార్‌తో సత్సంబంధాలు కలిగి ఉండడం వైఎస్సార్ సీపీ గెలుపునకు అనుకూలించే అంశాలుగా మారాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో కూడా భారీగా చేరికలు నిత్యం కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలో కొత్తగా సుమారు 30 వేల మంది యువత ఓటుహక్కును పొందగా వారి ఓట్లు కూడా దాదాపుగా యువ నాయకత్వం వైపు ఉండే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top