అందరికీ భరోసా

అందరికీ భరోసా - Sakshi


 అన్నివర్గాల వారికీ భరోసా కల్పించేలా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేయడంపై రైతులు ఆనందం వ్యక్తం చేయగా, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు నిర్ణయించడంపై ఆ వర్గం వారు పట్టరాని సంతోషంతో ఉన్నారు. అన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయడంపై నిరుపేదల ఆరోగ్యానికి ధైర్యం ఇచ్చినట్టు ఉందని ప్రజలు అంటున్నారు. ఇది విద్య, ఉద్యోగ, కార్మిక, కర్షక, యువత మెనిఫెస్టో అని జనం కొనియాడారు.

 

 102, 103 సేవలతో ఎంతో మేులు

 రైతులకు అన్ని విధాలా మేలు చేసేలా జగన్ ప్రకటన చేయడం ఆనందదాయ కం. 102కు రైతులు ఫోన్ చేస్తే 24 గంట ల్లో మొబైల్‌టీం సర్వీస్‌లు అందించడం, 103కు ఫోన్ చేస్తే పశువులకు ఇంటివద్దనే సేవలు చేస్తాననడం చాలా సంతోషం. తండ్రి  కంటే మెరుగైన సేవలను రైతులకు అందించేందుకు జగన్ ముందుకు రావడం రాష్ట్రానికి శుభపరిణామం.

  -   బోను లక్ష్మి, మహిళా రైతు, పొందూరు.

 

 రైతు పక్షపాతి

 వైఎస్‌ఆర్ సీపీ మరోసారి రైతుల పక్షపాతి అని నిరూపించుకుంది. రైతులకు రుణమాఫీ ఎంతగానో ఉపయోగకరం. గతంలో రాజశేఖర్‌రెడ్డి రైతు రుణాలను మాఫీ చేశా వారి పాలిట ఆశాజ్యోతిగా నిలిచారు. ఇప్పుడు పార్టీ మేనిఫెస్టోలో రైతులకు పెద్దపీట వేసి ఆయన తనయుడు జగన్ రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు.

 - కోట చిన్నబాబు, రైతు, నౌపడ  

 

 వడ్డీలేని రుణాలతో ఆర్థిక భరోసా

 వడ్డీలేని రుణాలు ఇవ్వడం, డ్వాక్రా రుణాల మాఫీతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పించినట్లైంది. వైఎస్‌ఆర్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో దీన్ని పొందుపరచడం గొప్ప సాహసంతో తీసుకున్న నిర్ణయం.      

 - ఎస్.ప్రభాకరరావు , విశ్రాంత మెజిస్ట్రేట్

 

 నిరుద్యోగులకు వరం  

 కోస్టల్ కారిడార్‌ను విస్తరించడం నిరుద్యోగులకు వరమనే చెప్పాలి. పరిశ్రమలు భారీగా నెలకొల్పడం ద్వారా యువతీ యువకులకు ఉద్యోగభృతిని కల్పించవచ్చు. వయస్సు మీద పడటంతో జీవితంపై నిరాశతో ఉన్న వేలాది మంది నిరుద్యోగులకు ఇది చక్కని అవకాశంగా మారుతుండనడంలో సందేహం లేదు.

 - పి.రంగనాయక్, ఎంకాం పీజీ విద్యారి

 

 ‘శ్రీకర నిధి’ రైతుకు మేలు

 శ్రీకర నిధి పథకం రైతులకు ఎంతో మేలు. మెనిఫెస్టోలు రైతుల సంక్షేమానికి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పథకం నిజంగా రైతులకు వరం. తండ్రిని మించిన తనయుడుగా జగన్ రైతులకు ధైర్యాన్ని ఇస్తున్నారు.

 - గొర్లెల జనార్దనరావు, రైతు, కొత్తవూరు, పలాస

 

 కాంట్రాక్టు ఉద్యోగులకు మంచిరోజులు

 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చే యాలనే ఆలోచన చాలా సంతోషమైంది. గతంలో ఏ పార్టీ కూడా తన ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు. చాలంమిదఏళ్ల తరబడి కనీస వేతన చట్టానికి కూడా వర్తించకుండా విధులు నిర్వహిస్తున్నారు.  కూన శాంతారావు,ప్రైవేటు విద్యా సంస్థల అధ్యాపకులు,కాశీబుగ్గ

 

  ఏ కార్డయిన 24 గంటల్లో..

 రేషన్‌కార్డు కోసం వివాహం అయిన తర్వాత సంవత్సరాల తరబడి కార్యాల యాల చుట్టూ తిరిగాం. కాని జగన్ ఎటువంటి కార్డు అయినా 24 గంటల్లో అందిస్తామంటు

 న్నారు.

  - జల్లు నాగేశ్వరరావు, ఇందిరానగర్‌కాలనీ, పాలకొండ

 పింఛను పథకం బాగుంది

 ప్రస్తుతం పింఛను కోసం రోజుల తరబ డి ఎదురుచూస్తున్నాం. వికలాంగుడున ని పింఛను కోసం వెళితే ఎవరూ పట్టిం చుకోవడం లేదు. వికలాంగుల కోసం అధిక మొత్తంలో పింఛను ఇస్తానని వైఎస్సార్ సీపీ  చెబుతుంది.

 - జమ్మల గురువులు, వికలాంగుడు, పాలకొండ

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top