జగన్‌మోహన్‌రెడ్డితోనే సమస్యల పరిష్కారం

జగన్‌మోహన్‌రెడ్డితోనే సమస్యల పరిష్కారం - Sakshi


 నరసన్నపేట, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రభుత్వం కొలువుదీరితేనే సమస్యలు పరిష్కారమవుతాయని నరసన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నా రు.  ప్రజలంతా..సహకరించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పార్టీ అభ్యర్థిగా మం గళవారం  నామినేషన్ దాఖలు చేసే ముందు సత్యవరం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్‌పై చర్చ జరుగుతోందని..అందుకు ఆస్కారం లేకుండా..తనకు వేసే ప్రతి ఓటునూ..ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతికి  కూడా వేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 మా జీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అధికార దాహంతో చంద్రబాబు..ప్రజలను మభ్యపెట్టే హామీలిస్తున్నారన్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రైతుల ఆత్యహత్యలకు పురగొల్పిన ఆయన..మళ్లీ రైతు జపం చేస్తుండడం హాస్యాస్పదమన్నారు. సభకు హాజరైన ప్రతి ఒక్కరూ..తమ కుటుంబాలు, బంధువులు ఫ్యాన్ గుర్తుకు ఓటేసేలా చూడాలన్నారు.     ఎంపీ అభ్యర్థి రెడ్డి శాంతి మాట్లాడుతూ మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో నర్సీపట్నం ఎమ్మెల్యే ముత్యాల పాప,పార్టీ నాయకులు ఎచ్చెర్ల సూర్యనారాయణ, అందవరపు సూరిబాబు, ఎంవీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

 

 అట్టహాసంగా నామినేషన్

 నరసన్నపేట, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్ అట్టహాసంగా మంగళవారం నామినేషన్ వేశారు.  మధ్యాహ్నం 2 గంటల సమయంలో తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారిణి కె.తనూజారాణికి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు మబగాంలోని తన నివాసంలో పూజలు చేశారు. అక్కడి నుంచి అమ్మవారి దేవాలయానికి వెళ్లి..దర్శించుకున్నారు. అక్కడి నుంచి టాప్‌లెస్ జీపులో బయల్దేరి  రావులవలస గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి పూజలు చేశారు. పైడి తల్లి అమ్మవారికి పూజలు చేశారు. సభ పూర్తయిన తరువాత సత్యవరం జంక్షన్ నుంచి నరసన్నపేట తహశీల్దార్ కార్యాలయానికి  ర్యాలీగా వెళ్లి..నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మాన పద్మప్రియ, లోక్‌సభ అభ్యర్థిని రెడ్డి శాంతి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top