సంఖ్య తేలింది... ఇక సమరమే

సంఖ్య తేలింది... ఇక సమరమే

 విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన వారి సంఖ్య తేలిపోయింది. నామినేషన్ ఉపసంహరణకు ఇచ్చిన రెండు రోజుల (మంగళ,బుధ వారాలు) గడువులో మొత్తం 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 77 మంది, ఒక లోక్‌సభ స్థానానికి తొమ్మిది మంది కలిపి మొత్తం 86 మంది బరిలో నిలిచారు. ఈ నెల 12 నుంచి వివిధ రాజకీయ పార్టీల నేతలు అసెంబ్లీ స్థానాలకు 114 నామినేషన్లు దాఖలు చేశారు.  21న నామినేషన్ల  పరిశీలన చేపట్టగా 20 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.కాగా 22, 23 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సందర్భంగా 18 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 9 అసెంబ్లీ స్థానాల్లో 77 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు లెక్క తేలింది.  జిల్లాలోని ఒక్క పార్లమెంటు స్థానానికి 11 నామినేషన్లు దాఖలు కాగా,  పరిశీలనానంతరం పది నామినేషన్లు అర్హత పొందాయి. ఒక నామినేషన్ ఉపసంహరించుకోగా తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని రిటర్నింగ్ అధికారి కాంతిలాల్ దండే తెలిపారు.  

 

 ఉపసంహ రించుకున్న వారి సంఖ్య..

 కురుపాం నుంచి ఒకరు, పార్వతీపురం నుంచి ఇద్దరు, సాలూరు నుంచి ఇద్దరు, చీపురుపల్లి నుంచి నలుగురు, గజపతినగరం నుంచి ఒకరు, నెల్లిమర్ల నుంచి ఒకరు, విజయనగరం నుంచి ఒకరు, ఎస్ కోట నుంచి ఐదుగురు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో అత్యధికంగా ఎస్ కోట నుంచి ఐదుగురు ఉపసంహరించుకోగా బొబ్బిలి నుంచి నామినేషన్ల ఉపసంహరణ చేసిన వారెవరూ లేకపోవడం విశేషం. 

 

 అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థులు

 కురుపాం అసెంబ్లీ స్థానం: పార్టీ పాముల పుష్ప శ్రీవాణి (వైఎస్సార్ సీపీ )కోలక లక్ష్మణమూరి ్త(సీపీఎం), జనార్దన్ థాట్రాజ్ (టీడీపీ) ఎర్రమిల్లి ఇంద్రసేనవర్ధన్ (కాంగ్రెస్ ), నిమ్మక జయరాజ్(టీడీపీ రెబల్),  స్వతంత్ర అభ్యర్థులు ఆరిక రసూల్, పాలక రంజిత్ కుమార్, కడ్రక వెంకటస్వామి.

 పార్వతీపురం:  జమ్మాన ప్రసన్నకుమార్( వైఎస్సార్ సీపీ ),అలజంగి జోగారావు(కాంగ్రెస్),బొబ్బిలి చిరంజీవులు(టీడీపీ),యమ్మల మన్మధరావు(సీపీఎం),గొంగాడ లక్ష్మణరావు(జేఎస్పీ), ఇతరులు మర్రి తవిటయ్య, వెలగాడ కృష్ణ , గర్భాపు పుష్పనాథం

 

 సాలూరుః పీడీక రాజన్నదొర( వైఎస్సార్ సీపీ ),సీదరపు అప్పారావు(సీపీఎం),ఆండ్రబాబా(కాంగ్రెస్ ), ఆర్‌పి భంజ్‌దేవ్(టీడీపీ )జన్ని రాము (సీపీఐ), ఊయక ముత్యాలు (ఇండిపెండెంట్ ). బొబ్బిలి: ఆర్‌వీఎస్‌కే రంగారావు( వైఎస్సార్ సీపీ ), వెంగళ నారాయణ రావు( బీఎస్పీ) ఎస్‌వీసీహెచ్ అప్పలనాయుడు( కాంగ్రెస్),తెంటు లక్ష్మునాయుడు (టీడీపీ), వాసిరెడ్డి అనూరాధ (జేఎస్పీ), ఎస్ జాన్ విల్సన్ (ఇండిపెండెంట్ ).

 

 చీపురుపల్లి ః బెల్లాన చంద్రశేఖర్ (వైఎస్సార్ సీపీ ), కిమిడి మృణాళిని (టీడీపీ ),బొత్స సత్యనారాయణ(కాంగ్రెస్), ఎస్.అనంత రాజు (పీపీఐ ),తాడ్డి శ్రీనివాసరావు (జేఎస్పీ), బులుసు నాగ శ్రీనివాస్(ఆమ్ ఆద్మీ ), రెడ్డి లక్ష్మునాయుడు(లోక్ సత్తా), గంటాన అప్పారావు(ఇండిపెండెంట్), కెంబూరి రామ్మోహనరావు(ఇండిపెండెంట్ ), పీరుబండి ప్రకాశరావు(ఇండిపెండెంట్), పెద్ది వెంకటేష్ (ఇండిపెండెంట్ ) గజపతినగరం : కడుబండి శ్రీనివాసరావు( వైఎస్సార్ సీపీ), బొత్స అప్పలనర్సయ్య (కాంగ్రెస్) ,కొండపల్లి అప్పలనాయుడు (టీడీపీ), ఆయిక జ్ఞానేశ్వరరావు(పీపీఐ),దేవర ఈశ్వరరావు (లోక్‌సత్తా), మిడతాన రవికుమార్(ఆమ్ ఆద్మీ), లగుడు గోవింద(జేఎస్పీ), సున్నపు రామస్వామి(ఇండిపెండెంట్).

 

 నెల్లిమర్లః పివివి సూర్యనారాయణ రాజు(సురేష్ బాబు) (వైఎస్సార్ సీపీ), బడ్డుకొండ అప్పలనాయుడు(కాంగ్రెస్), ఆర్జి శివప్రసాద్(బీఎస్పీ), పతివాడ నారాయణ స్వామినాయుడు(టీడీపీ), తాళ్లపూడి సత్యనారాయణ (జేఎస్పీ), మూల భూషణ అప్పారావు(ఆమ్‌ఆద్మీ ), ఎస్. లలితకుమారి (పీపీఐ), బగ్గ అప్పారావు(ఇండిపెండెంట్), కె.తాతినాయుడు(ఇండిపెం డెంట్), ఇజ్జురోతు రామునాయుడు(ఇండిపెండెంట్) విజయనగరం : కోలగట్ల వీరభద్రస్వామి (వైఎస్సార్ సీపీ ), మీసాల గీత (టీడీపీ), గండ్రేటి సత్యనారాయణ(బీఎస్పీ), యడ్ల రమణమూర్తి (కాంగ్రెస్) ,చనమల్ల ప్రసాదరావు(జేఎస్పీ), పాండ్రంకి వెంకటరమణ( లోక్‌సత్తా), వేగేశ్న విజయరామరాజు(పీపీఐ), వి.శివానంద( నవభారత్ ), శీర రమేష్ కుమార్ (ఆమ్ ఆద్మీ), రెడ్డి త్రినాథరావు (ఇండిపెండెంట్ ), సారిపల్లి శ్రీనివాసరావు( ఇండిపెండెంట్).               

     

 ఎస్.కోటః రొంగలి జగన్నాథం( వైఎస్సార్ సీపీ ), కోళ్ల లలిత కుమారి (టీడీపీ), ఇందుకూరి రఘురాజు (కాంగ్రెస్),  జి.ముత్యాలరావు (బీఎస్పీ), గండ్రేటి అప్పారావు(పీపీఐ), దరిమిరెడ్డి వెంకటరావు( జేఎస్పీ), పూసపాటి కెవీఎస్‌ఎస్‌పీ వర్మ(ఆమ్ ఆద్మీ) , స్వతంత్ర అభ్యర్థులు కాండ్రేగుల నరసింగరావు, గొంప నాగభూషణం.

 

 నియోజకవర్గాల వారీగా బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య..

  కురుపాం- ఎనిమిది మంది, పార్వతీపురం-ఎనిమిది మంది, సాలూరు- ఆరుగురు, బొబ్బిలి-ఆరుగురు, చీపురుపల్లి-11 మంది, గజపతినగరం-ఎనిమిది మంది, నెల్లిమర్ల- పది మంది, విజయనగరం-11 మంది, ఎస్.కోట- 9 మంది ఉన్నారు. 

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top