నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యం


‘ఆప్’ టీ-మేనిఫెస్టో విడుదల



నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం తెలంగాణ మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల్లోనే జనలోక్‌పాల్‌లా లోకాయుక్తను బలోపేతం చేయడంతో పాటు అధికారుల్లో అవినీతి, ప్రజాసమస్యలపై ఫిర్యాదుల స్వీకారం కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక హెల్ప్‌లైన్ సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పార్టీ తెలంగాణ కమిటీ కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి, సభ్యులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, సభ్యులు గోసుల శ్రీనివాస్ యాదవ్, వ్యవసారరంగ నిపుణుడు రామాంజనేయులు, తదితరులు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.



గ్రామీణ ఆరోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి నిమ్స్ తరహా ఆస్పత్రుల నిర్మాణం చేయనున్నట్లు ప్రకటించింది. వ్యవసాయానికి ఏడు గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు 300 యూనిట్లలోపు విద్యుత్ వాడే చిన్నతరహా పరిశ్రమలకు బిల్లులో 50 శాతం రాయితీ, 100 లోపు యూనిట్ల విద్యుత్ వాడే గృహాలకు, వాణిజ్య సంస్థలకు ఉచిత సరఫరా వంటి అంశాలను మేనిఫెస్టోలో రూపొందించింది

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top