రెబల్స్‌పై రు బాబు

రెబల్స్‌పై రు బాబు - Sakshi

ఏం జయరాజ్... బాగున్నావా... పార్టీలో సీనియర్ నాయకుడివి నువ్వే ఇలా చేస్తే ఎలా...? మీకు భవిష్యత్ ఉంది. వేరే విధంగా  మేలు చేస్తాం,  తప్పనిసరి పరిస్థితుల్లో థాట్రాజ్‌కు టిక్కెట్ ఇచ్చాను, అసలే జిల్లాలో పార్టీ పరిస్థితి బాగోలేదు. పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అంటూ ఒక వైపు బుజ్జగిస్తూనే లేకపోతే చర్యలు తప్పవని ఇటు జయరాజ్, అటు కెంబూరి రామ్మోహనరావులను చంద్రబాబునాయుడు  ఫోన్‌లో హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల ను వారు బేఖాతరు చేశారని తెలిసింది.

 

 సాక్షి  ప్రతినిధి, విజయనగరం:జిల్లాలో తిరుగుబాటు అభ్యర్థులు చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. తానేం చేసినా తమ్ముళ్లు శిరసావహిస్తారని భావించి న బాబుకు ఆ నమ్మకమే నట్టేట ముంచే పరిస్థితి తెచ్చింది. తనను ఎదరించే దమ్ము ఎవరికీ లేదని పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా పక్కజిల్లా నుంచి, పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడంతో రగిలిపోయిన నేతలు ఇప్పుడు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉండడంతో ఓటమి భయం పట్టకున్న చంద్రబాబునాయుడు ఏకంగా బెదిరింపులకు దిగారు. 

 

 టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంత బుజ్జగించినా ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు దారికి రాలేదు. ఎమ్మెల్సీ, ఇతరత్రా పదవులు ఇస్తామని ప్రలోభ పెట్టినా లొంగలేదు. ఆఫర్లు ప్రకటించినా వాటికి కక్కుర్తి పడలేదు. ఆయన ఆదేశాలను ధిక్కరించి పోటీకి సై అన్నారు. స్వతంత్రులగా బరిలో నిలబడ్డారు. దీంతో కంగుతిన్న చంద్రబాబు ఇప్పుడేకంగా బెదిరింపులకు దిగుతున్నారు. పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు శుక్రవారం నాటికి మద్దతు పలకపోతే చర్యలు తీసుకోవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలలో రెబల్స్ కారణంగా టీడీపీకి గట్టిదెబ్బ తగిలే పరిస్థితులు ఏర్పడ్డాయి. చీపురుపల్లిలో కెంబూరి రామ్మోహనరావు, కురుపాంలో నిమ్మక జయరాజ్ ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచారు. నామినేషన్ వేసిన దగ్గరి నుంచి ఉపసంహరించుకోమని జిల్లా నా యకత్వంతో పాటు చంద్రబాబు కూడా వారిని పలుమార్లు బుజ్జగించారు. 

 

 ఒకసారి జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను నేరుగా పంపించగా, మరోసారి అశోక్ గజపతిరాజు ఫో న్‌లో సంప్రదింపులు చేశారు. ఇంకోసారి రెబల్ అభ్యర్థి బంధువులతో రాయబేరాలు నడిపించా రు. ఎన్ని చేసినా పోటీ నుంచి తప్పుకోడానికి వారు అంగీకరించలేదు. సరికదా మధ్యవర్తిత్వానికి వచ్చిన వ్యక్తులపై ఒంటికాలిపై లేచారు.  మొత్తానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. రెబల్ అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో ఉన్నట్టు ఎన్నికల యంత్రాం గం ప్రకటించింది.  రెబల్స్ బరిలో ఉంటే పార్టీ అభ్యర్థులు ఓటమి చెందుతారన్న భయం టీడీపీ నాయకత్వానికి పట్టుకున్నట్టు ఉంది. ఎలాగూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింద ని, ఇక చేసేదేమీలేదని, ప్రచారానికి వెళ్లకుండా పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చేలా వారిని నయానో భయానో చేసి దారికి తెచ్చుకోవడానికి అధిష్టానం రంగంలోకి దిగింది. గురువారం కొంతమంది దూతలను తిరుగుబాటు అభ్యర్థుల వద్ద కు పంపించింది. అయితే వారు తమ నిర్ణయం లో ఎటువంటి మార్పులేదని తెగేసి చెప్పేయడంతో ఏకంగా అధినేతే రంగంలోకి దిగారు. శుక్రవారంలోగా పార్టీ అభ్యర్థుల కు మద్దతు తెలపకపోతే చర్యలు తీసుకోవల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా రెబల్స్ వినిపించుకోవడం లేదు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top