టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు

టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు - Sakshi


హైదరాబాద్:  సీమాంధ్రలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గట్టం ముగిసింది. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో అత్యధికంగా టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించిన స్థానాల్లో కూడా టిడిపి రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.



టిడిపి తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసిన  స్థానాలు:



గుంటూరు జిల్లా:

ప్రత్తిపాడు -  వీరయ్య

సత్తెనపల్లి - నిమ్మకాలయ రాజనారాయణ

నర్సరావుపేట - సింహాద్రి యాదవ్‌

మాచర్ల - నలుగురు రెబల్స్‌ నామినేష్‌



పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు -  టి.వి రామారావు

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం   - మైలా వీర్రాజు నామినేషన్‌

తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం - ఆరుగురు నామినేషన్‌ దాఖలు

నెల్లూరు జిల్లా  గూడూరు -  మాజీ  ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు

చిత్తూరు జిల్లా  సత్యవేడు -  తలారికృష్ణ, ఆదిత్య

విశాఖపట్నం జిల్లా  యలమంచిలి  - సుందరపు విజయ్ కుమార్



బిజెపికి కేటాయించిన ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, వైఎస్ఆర్ జిల్లాలలోని కడప స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులకు టిడిపి  బిఫారాలు ఇచ్చింది. అనంతపురం జిల్లా గుంతకల్లు స్థానం  బీజేపీకి కేటాయించారు. టీడీపీ తరఫున జితేంద్రగౌడ్‌ నామినేషన్ దాఖలు చేశారు.



ఇదిలా ఉంటే  టీడీపీ టికెట్ల కేటాయింపు విషయంలో  నామినేషన్ల తుదిరోజు వరకు హైడ్రామా నడిచింది. చివరి నిమిషంలో కూడా టిడిపి అభ్యర్థులను మార్చింది. అరకు అసెంబ్లీ స్థానంను తొలుత  కుంభా రవిబాబుకు కేటాయించారు. ఈరోజు సోముకు టికెట్ ఇచ్చారు. మాచర్ల అసెంబ్లీకి సంబంధించి శ్రీనివాస యాదవ్ స్థానంలో చలమారెడ్డికి టికెట్ ఇచ్చారు.



శింగనమల అసెంబ్లీ స్థానంను రవికుమార్కు కేటాయించి, ఆ తరువాత మాజీ మంత్రి శమంతకమణి కుమార్తె  పామిడి యామిని బాలకు టికెట్ ఇచ్చారు. మళ్లీ ఈరోజు మాజీ మంత్రి శైలజానాథ్ కూడా టిడిపి తరపున నామినేషన్ దాఖలు చేశారు.



నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉంది. ఆ రోజున ఎవరు బరిలో ఉంటారో, ఎవరు విరమించుకుంటారో తేలుతుంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top