సైకిల్ పంక్చర్..


మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ :  మంచిర్యాల పురపాలక ఎన్నికల్లో సైకిల్‌కు ప్రజలు పంక్చర్ చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాల్లో గెలుపొందగా.. ఈసారి 13 స్థానాల్లో పోటీ చేసింది. ఏ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. తెలంగాణ విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అవలంబించడం వల్లే ప్రజలు తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అభ్యర్థులు కొందరు మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచ్చారు. మరికొందరు 30లోపే ఓట్లు సాధించారు.



 ఒకటో వార్డులో అలుపట్ల సుశీలాదేవి 27 ఓట్లు, రెండో వార్డులో అరుకట్ల సుశీల 90, మూడో వార్డులో పెండ్లి రజిత 456, 5వ వార్డులో జబ్బార్ 32, 8వ వార్డులో ఓలం రాజ్‌కుమార్ 19, 15వ వార్డులో అంకం గంగామణి 53, 16వ వార్డులో నడిగొట్టు లక్ష్మి 198, 17వ వార్డులో ఒన్నోజుల సువర్ణ 178, 19వ వార్డులో మహ్మద్ రహ్మతుల్లా 165, 21వ వార్డులో మహ్మద్ గౌసౌద్దీన్ 89, 30వ వార్డులో యూసుఫ్‌అలీ 3, 31వ వార్డులో షహనాజ్ ఫాతిమా 48, 32వ వార్డులో బొడ్డు తిరుపతి 107 ఓట్లు సాధించారు.



 సీపీఐ ఓటమి..

 టీఆర్‌ఎస్ పార్టీతో పొత్తులో భాగంగా 4వ వార్డులో పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. టీఆర్‌ఎస్ మద్దతుగా నిలిచి ప్రచారం చేసినా మహ్మద్ షపీ 242 ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచాడు.



 ప్రభావం చూపని బీజేపీ..

 బీజేపీ 19 వార్డుల్లో పోటీ చేసింది. 1వ వార్డులో వెల్తూరు రాధిక 49 ఓట్లు, 6వ వార్డులో గంగాధరి తిరుపతి 71, 7వ వార్డుల్లో బానోతు దాస్య 285, 8వ వార్డులో చిట్యాల చంద్రకళ 43, 12వ వార్డులో ముదాం మల్లేశ్ 87, 15వ వార్డులో కేసిరెడ్డి పద్మ 398, 17వ వార్డులో బోడకుంట ప్రభ 69, 18వ వార్డులో ఆకుల అశోకవర్దన్ 110, 19వ వార్డులో అప్పాసు శ్రీకాంత్ 265, 21వ వార్డులో చందా కిరణ్‌కుమార్ 109, 22వ వార్డులో ముద్దసాని శారద 124, 23వ వార్డులో మల్యాల జ్యోతి 61, 25వ వార్డులో బొద్దున మీనాకుమారి 281, 26వ వార్డులో కుంట్ల లక్ష్మి 167,  27వ వార్డులో రాథోడ్ సుభాష్‌నాయక్ 95, 28వ వార్డులో కాంపల్లి శశికుమార్ 78, 29వ వార్డులో శ్రీరాంభట్ల ఉమా మహేశ్వరి 49, 30వ వార్డులో బోడ ధర్మేంధర్ 261, 31వ వార్డులో వైద్య విజయ 128 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థులు కొన్ని చోట్ల రెండు, మూడు స్థానాల్లో నిలిచి అభ్యర్థులకు కంగారు పెట్టించారు. ముస్లిం వెల్ఫేర్ పార్టీ పోటీ చేసిన ఒక్క స్థానంలో ఓటమి చవిచూసింది. ఇక వివిధ వార్డుల్లో పోటీ చేసిన 71 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో కొంత మంది ప్రత్యుర్థులకు గట్టి పోటీని ఇచ్చినా ఏ ఒక్కరు కూడా గెలవకపోవడం గమనార్హం.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top