తొమ్మిదేళ్ల పాలనలో బాబు చేసిందేమిటో అడగండి

తొమ్మిదేళ్ల పాలనలో బాబు చేసిందేమిటో అడగండి - Sakshi

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పదవీ కాలంలో ప్రజల కోసం ఏం చేశారనే విషయమై ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ ఓటర్లకు సూచించారు. ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నానితో కలసి శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తంగెళ్లమూడిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు పేద రోగుల నుంచి యూజర్ చార్జీల పేరుతో ముక్కుపిండి డబ్బు వసూలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టగా.. అంతకుముందు చంద్రబాబు విద్యార్థులకు కనీసం మెస్ చార్జీలు కూడా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు సవాలక్ష ఉంటాయని, ఆయన పదవీ కాలంలో కనీసం వర్షాలు కూడా కురవక పంటలు ఎండిపోయి దిక్కుతోచని పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నారని వివరించారు. 

 

 అలాంటి కష్టాలు తిరిగి ఈ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా ఉండాలంటే మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం తండ్రిని మించిన తనయునిగా వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ మేనిఫెస్టోలో అనేక నూతన పథకాలకు రూపకల్పన చేశారని వివరించారు. అవన్నీ అమలు జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లువేసి అత్యధిక మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జిల్లా ప్రజలు పోలవరం ప్రాజెక్టు కోసం కన్న కలలను మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సాకారం చేసేందుకు కృషి చేశారని, సుమారు రూ.17 వేల కోట్ల నిధులతో ప్రాజెక్టు పనులు ప్రారంభించారని వివరించారు. ఆయన మరణంతో ఆ ప్రాజెక్టు అటకెక్కిందన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు. 

 

 అప్పుడు చేయలేనిది.. ఇప్పుడేం చేస్తారు : ఆళ్ల నాని

 ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని మాట్లాడుతూ చంద్రబాబు తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి ఈసారి అధికారం ఇస్తే చేస్తానన డాన్ని ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన చంద్రబాబు వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు చేసిన వారిని అణగదొక్కిన విషయూన్ని ఎవరూ మర్చిపోలేదన్నారు. రైతులపై తుపాకులు ఎక్కు పెట్టించిన, మహిళలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర  ఆయనిదని గుర్తు చేశారు. చంద్రబాబుకు అధికారం కట్టబెట్టి తప్పు చేశామని గ్రహించిన ప్రజలు అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డికి పట్టం కట్టారన్నారు. వైఎస్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదని.. అడిగిన పనులు చేశారని.. ఇంకా ఏదో చేయాలనే తపనతో 104, ఆరోగ్య శ్రీ, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటి వినూత్న పథకాలు ప్రవేశపెట్టి పేద వారికి కూడా కార్పొరేట్ విద్య, వైద్య సౌకర్యాలు కల్పించారని వివరించారు. తన పదవీ కాలంలో తప్పులు చేశానని ఒప్పుకున్న ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా అని చంద్రబాబును నాని సూటిగా ప్రశ్నించారు. 

 

 తప్పులు చేసే వారిని తమ నేతగా ప్రజలు ఎలా ఎన్నుకుంటారని, సిగ్గులేకుండా ప్రజల మధ్యకు ఎలా వస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సువర్ణ యుగం రావడానికి ఎంతో సమయం లేదని, మరో 25 రోజుల్లో జగన్ సారధ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిపా రు. ఆ వెంటనే వృద్ధులకు, వికలాంగులకు, అన్నిరకాల పింఛనుదారులకు ఇ చ్చే సొమ్మును పెంచుతారన్నారు. నగరంలోని అర్హులైన ప్రతి పేదకు ఇల్లు అందించడం కోసం ఏటా సుమారు 10 వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వారి వెంట వైసీపీ నాయకులు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్, మున్నుల జాన్‌గురునాథ్, గంపల బ్రహ్మావతి, బాలిన ధనలక్ష్మి, తోట శివ, యర్రా రాంబాబు, కొండేటి రాంబాబు, మోర్త రంగారావు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, నెరుసు చిరంజీవులు, జి.బాలాత్రిపురసుందరి, అహ్మదున్నీసా, కోట రవి, పసుపులేటి శేషు తదితరులు ఉన్నారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top