కింకర్తవ్యం!?

కింకర్తవ్యం!? - Sakshi


 సాక్షి, ఏలూరు :  బీజేపీతో టీడీపీ పొత్తు తెగతెం పులు కావడం టీడీపీ అభ్యర్థులను అయోమయూనికి గురి చేస్తుం డగా.. ఆ పార్టీ నాయకులను పునరాలోచనలో పడేసింది. పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో కార్యకర్తలు చెల్లాచెదురవుతున్నారు. విశ్వసనీయత, నీతిలేని పార్టీ కోసం పనిచేయడం వ్యర్థమని భావించి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మరోవైపు పొత్తు పేరుతో నాటకం ఆడిన చంద్రబాబుపైన, టీడీపీ నేతలపైన ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు సమాయత్తం అవుతున్నారు. ఈ పరిస్థితులు తమ కొంప ముంచే ప్రమాదం ఉందని టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

 

 8 మంది అభ్యర్థులనే ప్రకటించిన టీడీపీ

 శుక్రవారం సెలవు కావటంతో నామినేషన్లు వేయటానికి శనివారం ఒక్కరోజే మిగిలి ఉంది. ఇప్పటికీ  జిల్లాలో 7 స్థానాలకు టీడీపీ గురువారం రాత్రి వరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటించిన స్థానాల్లోని అభ్యర్థులకూ తమకే టికెట్ ఉంటుందనే నమ్మకం లేదు. నిడదవోలు, ఆచంట, తణుకు, దెందులూరు, ఏలూరు, గోపాలపురం, పోలవరం, ఉంగుటూరునియోజకవర్గాలకు మాత్రమే ఇప్పటివరకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, చింతలపూడి నియోజకవర్గాల అభ్యర్థులను గురువారం సాయంత్రానికి కూడా ప్రకటించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు చిత్తయిన నేపథ్యంలో నరసాపురం పార్లమెంటరీ, తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాలకు కూడా టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top