చిరునవ్వు ఆమెకో వరం

చిరునవ్వు ఆమెకో వరం - Sakshi


శోభా నాగిరెడ్డి నా కోడలు. శోభా నాగి రెడ్డితో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. శోభ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. నేను 1983లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సమ యంలో శోభ తండ్రి ఎస్వీ సుబ్బారెడ్డి కర్నూలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్. ఆయనే ‘మీ అత్త’ అంటూ నన్ను శోభకు పరి చయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ నేను ఎక్కడ కనిపించినా అత్తయ్యా బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించేది. నా భర్త గురించి అడిగేది. సుబ్బారెడ్డి 1989లో కాం గ్రెస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అపుడు నేను కూడా ఎమ్మెల్యేనే. శోభ భర్త భూమా నాగిరెడ్డి, బావ వీర శేఖరరెడ్డి కూడా నాతో పాటు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. దీంతో శోభతో సాన్నిహిత్యం మరింత పెరి గింది. ఆ తరువాత నేను టీడీపీలో చేరాను. అప్పటి నుంచి మరింత సన్నిహితంగా మెలిగే వాళ్లం.

 శోభ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆర్‌టీసీ చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు.



నేను తెలు గుమహిళ అధ్యక్షురాలిగా పనిచేశాను. ఈ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చేపట్టాల్సిన ఆందోళన కార్యక్ర మాలు, ప్రభుత్వ పరంగా మహిళల సంక్షే మం కోసం  చేపట్టాల్సిన చర్యలపై చర్చిం చుకునే వాళ్లం. శోభా నాగిరెడ్డి అక్క కుమార్తె, ప్రస్తుతం గుంటూరు జిల్లా వినుకొండ అసెం బ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న  నా కుమార్తె నన్నపనేని సుధ బెంగళూరు వైద్య కళాశాలలో సహధ్యాయులు. ఈ విధంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది. నేను నిర్వహించే ప్రతి ఎగ్జిబిషన్‌కు శోభ హాజర య్యేది. రాజకీయాల్లోకి మహి ళలు రావటం తక్కువ. వచ్చినా రాణించిన వారు ఇంకా తక్కువ. ఇక రాయలసీమలో మహిళలు రాజకీయాల్లో రాణించటమంటే కత్తిమీద సామే. అలాంటిది శోభ బాగా రాణించింది. ఆమెది  కష్టపడే తత్వం. మంచి వక్తగా పేరు తెచ్చుకుంది. ఎపుడూ నవ్వుతూ, సంప్రదాయబద్ధంగా కనపడేది. చిరునవ్వే శోభకు వరం. స్నేహానికి ప్రాణమిచ్చేది.  శోభ మరణం బాధాకరం.

 (వ్యాసకర్త ఎమ్మెల్సీ)

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top