117 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం


ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఉన్న 18 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తమిళనాడులో 39, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్లో12, మధ్యప్రదేశ్లో 10, బీహార్లో 7, ఛత్తీస్గఢ్లో 7, అసోంలో 6, పశ్చిమబెంగాల్లో 6, రాజస్థాన్లో 5, జార్ఖండ్లో 4, కాశ్మీర్లో 1, పుదుచ్చేరిలో 1 స్థానాలకు పోలింగ్ ఉదయమే ప్రారంభమైంది. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఆరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఆరోదశలో జరుగుతున్న ఈ ఎన్నికలలో 117 స్థానాలకు గాను 2076 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా హేమమాలిని, చిదంబరం కుమారుడు కార్తీ, మిళింద్ దేవ్రా తదితరులున్నారు.





తమిళనాడులో 39 స్థానాలు, పుదుచ్చేరిలో ఒకే ఒక్క సీటుకు ఎన్నిక గురువారం జరుగుతోంది. ఇక మహారాష్ట్రలోని 19 స్థానాలకు కూడా గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి బీజేపీ-శివసేన కూటమిని ఎదుర్కొంటున్నాయి. జార్ఖండ్లో నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలకు గాను 72 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రులు శిబు సోరెన్, బాబూలాల్ మరాండీ డుంకా స్థానంలో పోటీ పడుతున్నారు. మరోవైపు అసోంలోని ఆరు నియోజకవర్గాలకు 74 మంది బరిలో ఉన్నారు.  రాజస్థాన్లోని ఐదు నియోజకవర్గాల్లో 81 మంది అభ్యర్థులు, జమ్ము కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానంలో 12 మంది పోటీపడుతున్నారు. మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాలకు ఎన్నిక జరుగుతోంది.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top