పార్టీలే కొత్త..అభ్యర్థులు వారే !

పార్టీలే కొత్త..అభ్యర్థులు వారే ! - Sakshi


 శ్రీకాకుళం సిటీ,న్యూస్‌లైన్: జిల్లాలో మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోకపోయినప్పటికీ, వారి వారి పార్టీలు మాత్రం మారిపోయాయి. గతంలో పోటీచేసిన పార్టీలకు బదులుగా కొందరు పార్టీలు మారి అవే స్థానాల నుంచి పోటీల్లో దిగారు.   శ్రీకాకుళం నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ నుంచి గుండ అప్పలసూర్యనారాయణ లు పోటీచేయగా,తాజా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి ధర్మా న, టీడీపీ నుంచి గుండ భార్య లక్ష్మీదేవి బరిలో ఉన్నారు.

 

  ఆమదాలవలసలో గత ఎన్నికల్లో పీఆర్‌పీ తరఫున మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయన మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ తరఫున, కాంగ్రెస్ నుంచి బొడ్డేపల్లి సత్యవతిలు పోటీచేశారు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నుంచి తమ్మినేని సీతారాం బరిలో ఉండగా, మిగిలిన ఇద్దరూ అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు.  రాజాంలో కూడా 2009లో పీఆర్పీ తరపున కంబాల జోగులు, టీడీపీ నుంచి కావలి ప్రతిభాభారతి, కాంగ్రెస్ నుంచి కొండ్రు మురళీ మోహన్‌లు పోటీపడగా, తాజాగా వైఎస్సార్‌సీపీ నుంచి కంబాల జోగులు బరిలో ఉండగా, మిగిలిన ఇద్దరూ అవే పార్టీల నుంచి బరిలో ఉన్నారు.

 

  పాతపట్నంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి శత్రుచర్ల విజయరామరాజు, టీడీపీ తరఫున కలమట మోహనరావులు పోటీపడగా, తాజాగా టీడీపీ నుంచి శత్రుచ ర్లవిజయరామరాజు, వైఎస్సార్‌సీపీ నుంచి కలమట వెంకటరమణలు పోటీ పడుతున్నారు. పాలకొండలో 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి నిమ్మక గోపాలరావు, కాంగ్రెస్ తరఫున నిమ్మక సుగ్రీవులు, పీఆర్పీ నుంచి విశ్వాసరాయి కళావతిలు పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి దివంగత గోపాలరావు తనయుడు నిమ్మక జయకృష్ణ, కాంగ్రెస్ నుంచి సుగ్రీవులు, వైఎస్సార్‌సీపీ నుంచి విశ్వాసరాయి కళావతిలు పోటీలో ఉన్నారు.

 

  పలాసలో 2009 ఎన్నికల్లో పీఆర్పీ నుంచి వంకా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి జుత్తు జగన్నాయకులు, టీడీపీ నుంచి గౌతు శివాజీలు పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వంకా నాగేశ్వరరావు, టీడీపీ నుంచి గౌతు శివాజీలు బరిలో ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వజ్జ బాబూరావు నేడు వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేస్తున్నారు.టెక్కలిలో 2009లో కాంగ్రెస్ నుంచి కొర్ల భారతి, టీడీపీ నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, పీఆర్పీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌లు పోటీ చే యగా, తాజా ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్, జైసమైక్యాంధ్ర పార్టీ నుంచి కొర్ల భారతిలు బరిలో ఉన్నారు.

 

  ఇచ్ఛాపురంలో 2009లో కాంగ్రెస్ తరఫున నరేష్‌కుమార్ అగర్వాలా (లల్లూ), పీఆర్పీ నుంచి నర్తు రామారావులు పోటీపడగా, తాజాగా వైఎస్సార్‌సీపీ తరఫున నర్తు రామారావు పోటీ చేస్తుండగా, లల్లూ మాత్రం కాంగ్రెస్ టిక్కెట్‌పైనే పోటీ చేస్తున్నారు.

   శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి 2009లో కాంగ్రెస్ తరఫున కి ల్లి కృపారాణి, టీడీపీ నుంచి కింజరాపు ఎర్రన్నాయుడులు పోటీ చేయగా, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కృపారాణి, టీడీపీ నుంచి దివంగత ఎర్రన్నాయుడుకుమారుడు రామ్మోహన్‌నాయుడులు బరిలో ఉన్నారు. కొత్తగా వైఎస్సార్ సీపీ తరఫున రెడ్డి శాంతి బరిలోకి దిగారు.









 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top