పవన్ హీరో.. బాబు జీరో!

పవన్ హీరో.. బాబు జీరో! - Sakshi


* పవన్‌కల్యాణ్‌పై మోడీ పొగడ్తల వర్షం

* చంద్రబాబును లైట్ తీసుకున్న పవన్


 

సాక్షి, హైదరాబాద్ : మోడీ సభల ద్వారా తానూ ప్రచారం పొందాలని భావించిన చంద్రబాబునాయుుడికి అదేమీ దక్కకపోగా, కొంత భంగపాటే మిగిలింది. చంద్రబాబు తన ప్రసంగంలో నరేంద్రమోడీని ఆకాశానికెత్తినా.., ఇటు మోడీగానీ, అటు పవన్‌కల్యాణ్ గానీ వారి ప్రసంగాల్లో చంద్రబాబును పెద్దగా ప్రస్తావించలేదు. బాబును మోడీ పక్కనే కూర్చోబెట్టుకున్నప్పటికీ, టీడీపీ అధినేత గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. పైగా, పవన్‌కల్యాణ్‌ను పొగడ్తల్లో వుుంచెత్తారు. దీంతో బాబు మొహం వెలవెలబోరుుంది.

 

  ‘ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర కలిసి మొత్తం తెలుగు స్ఫూర్తిని పవన్‌కల్యాణే రక్షించగలడు’ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు మింగలేక, కక్కలేక అన్నట్లుగా వూరారుు. పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబును లైట్‌గానే తీసుకున్నారు. హైదరాబాద్‌లో వేదికపైనే ఉన్న బాబను పవన్ అంతగా పట్టించుకోలేదు. నిజానికి మోడీ సభల విషయంలో బీజేపీ చంద్రబాబును చాలా తేలిగ్గా తీసుకుంది. తీవ్ర స్థారుులో ఒత్తిళ్లు, టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులను వుుందుపెట్టి బ్లాక్‌మెరుులింగుకు దిగడంతో చివరకు రాజీపడి హైదరాబాద్, వుహబూబ్‌నగర్ సభల్లో పాల్గొనటానికి వూత్రం బాబును అనువుతించింది.

 

కేసీఆర్‌పై సంయువునం!: ‘లెక్కల్లో వుూడు ఒకట్లు కలిస్తే మూడవుతుంది. కానీ మోడీ, బాబు, పవన్‌కల్యాణ్ కలిస్తే అది నూటా పదకొండు అవుతుంది’ అంటూ మోడీ హైదరాబాద్ సభలో కొత్త లెక్కొకటి వినిపించారు. మోడీ సభల్లో చంద్రబాబుకు ఇదొక్కటే ఉపశవునం! అది తప్ప మోడీ ఎక్కడా చంద్రబాబు, టీడీపీ ప్రస్తావన తీసుకురాలేదు. రాష్ట్రంలో పర్యటించిన సోనియూ, రాహుల్‌లు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై విరుచుకుపడినా, మోడీ వూత్రం ‘ఒక కుటుంబానికి తెలంగాణను అప్పగించకూడద’నే ఒక్క వ్యాఖ్యకే పరిమితవుయ్యారు. కేసీఆర్‌పై పవన్ కల్యాణ్ మండిపడినా, మోడీ మాత్రం సంయమనం పాటించారు.

 

కేంద్రంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే మోడీ టీఆర్‌ఎస్ నేత కేసీఆర్ జోలికి వెళ్లలేదని పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి గత ఆగస్టులో ఇదే స్టేడియుంలో జరిగిన సభలో మోడీ తెలంగాణ కోణంలో పెద్దగా వూట్లాడలేదని, ఆయన ప్రసంగం తెలంగాణలోని పార్టీ శ్రేణులకే నచ్చలేదని బీజేపీ వుుఖ్యులు విశ్లేషించారు. దీంతో ఈసారి తెలంగాణ కోణంలో వూట్లాడాలని మోడీకి వుుందుగానే సూచించారు. అయినా, ఆయన మంగళవారం జరిగిన సభల్లో ‘కాంగ్రెస్ తెలంగాణకు పురుడు పోయుటానికి తల్లిని చంపేసింది’ లాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ తెలంగాణ శ్రేణులకు రుచించలేదు. మోడీ ప్రసంగాల్లో పీవీ నరసింహారావు, అంజయ్యులకు జరిగిన అవవూనాలను పదే పదే ప్రస్తావించారు. ఇది ప్రస్తుత సందర్భానికి అనుగుణంగా లేదని పార్టీ వుుఖ్యులే అంటున్నారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తెలుగువారిని అవవూనించినట్లే ఉందన్న మోడీ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు అపార్థం చేసుకునే అవకాశముందని వారు భావిస్తున్నారు.

 

 ‘టీడీపీతో పొత్తు పెట్టుకోవడంవల్ల ఇరు ప్రాంతాలకూ నచ్చేలా మోడీ వూట్లాడాల్సి వచ్చింది. తెలంగాణకు సంబంధించి మోడీ వూటల్లో పంచ్ లేకపోవటానికి ఇదే కారణం’ అని ఓ సీనియర్ నేత అన్నారు. పైగా, పవన్ ప్రసంగమూ తమను ఇరకాటంలోకి నెట్టిందని చెప్పారు. ‘నిజామాబాద్ సభలో పవన్‌కల్యాణ్ జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తెలంగాణవాడినని చెప్పారు. కానీ, హైదరాబాద్‌కు వచ్చేసరికి సీవూంధ్రపై ఎవరు ఏం వూట్లాడినా సహించేది లేదన్నట్లు వూట్లాడారు. దీంతో మేం ఈ సభల ద్వారా ఏం చెప్పుకోగలిగామో వూకే అర్థం కావడంలేదు’ అంటూ పెదవి విరిచారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top