బాబు తరఫున లోకేష్ నామినేషన్

బాబు తరఫున లోకేష్ నామినేషన్ - Sakshi


కోడ్ ఉల్లంఘించిన తమ్ముళ్లు

 కుప్పం, న్యూస్‌లైన్:  చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ స్థానానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుుడు తరఫున ఆయన తనయుుడు లోకేష్ గురువారం  నామినేషన్ దాఖలు చేశారు. ఉదయుం 11.30 గంటలకు చీవునాయునపల్లె వరదరాజస్వామి ఆలయుంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ జెండాలను ఏర్పాటు చేసి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు.

 

  పోలీసుల సాక్షిగా చీవునాయునపల్లె వరదరాజస్వామి దేవాలయూన్ని పార్టీ జెండాలతో పసుపువుయుం చేసి అధినేత కుమారుడికి స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో లోకేష్ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో స్వయంగా నామినేషన్ వేయలేని కారణంగా చంద్రబాబు గురువారం విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కె.ఉషాకిరణ్ ఎదుట ప్రమాణపత్రం చదివారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top