సీఎం సీటుపై కన్నేసిన బాలయ్య

సీఎం సీటుపై కన్నేసిన బాలయ్య - Sakshi


హిందూపురం: రాజకీయ ప్రవేశం చేసిన సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి సీటుపై కన్నేశారు. అవకాశమొస్తే సీఎం పదవి చేపడతానంటూ బాలకృష్ణ తన మనసులో మాటను వెల్లడించారు. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బుధవారం బాలకృష్ణ నామినేషన్ వేశారు.



ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. హిందూపురంను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. అయితే సీఎం పదవి చేపట్టడానికి సిద్దమన్న బాలకృష్ణ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.



బాలకృష్ణ వ్యాఖ్యలను చంద్రబాబు వర్గం జీర్ణించుకోలేపోతోంది. చంద్రబాబు ఉండగా బాలయ్య సీఎం ఎలా అవుతారని నారా వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. ఏ మాత్రం రాజకీయ, పాలన అనుభవం లేని బాలకృష్ణ సీఎం సీటుపై కన్నేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top