ముస్లింలకు రిజర్వేషన్లు వైఎస్ చలవే


ధారూరు, న్యూస్‌లైన్: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వమే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందని, వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 4 శాతం నుంచి 11 శాతానికి పెంచి అమలు చేయనున్నారని వైఎస్‌ఆర్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి క్రాంతికుమార్ అన్నారు. మండలంలోని సర్పన్‌పల్లి, అంతారం గ్రామాల్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచార పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు కావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చేవెళ్ల లోకసభ అభ్యర్థిగా కొండా రాఘవరెడ్డిని, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు.

 

మహానేత మరణం తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్ని ప్రజలకు దూరం చేస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే పేదల సంక్షేమం సాధ్యమని, దీనికి తమ పార్టీ రూపొందించిన మెనిఫెస్టోనే నిదర్శనమన్నారు. టీడీపీ నేత చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ఉచిత కరెంట్ అంటే వైర్లకు బట్టలు ఆరేసుకున్నట్లే.. అన్న ఆయన ఇప్పుడు ఉచిత విద్యుత్ అనడం విడ్డూరంగా ఉందన్నారు.

 

ఉద్యోగాల నిషేధాన్ని కొనసాగించి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసిన చంద్రబాబు యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 9 సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజల్ని కష్టాల పాలుచేసిన చంద్రబాబుకు బుద్ధిచెప్పాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి దివంగత నేత వైఎస్‌ఆర్ ఆశయం నెరవేర్చేలా దీవించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ీ సపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు నాగరాజ్, నాయకులు రాఘవరెడ్డి, రాజేందర్‌రెడ్డి, పి.రమేశ్, గోవర్దన్‌రెడ్డి, రాంరెడ్డి, బెనర్జీ, రాజిరెడ్డి,  నవాజ్‌ఖాన్, రాజునాయక్, శ్రీనునాయక్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top