మన నేతలు-ఆస్తిపాస్తులు


సొంత కారు కూడా లేని నాయకులు మనకు ఉన్నారు. మనం నమ్మకపోయినా ఇది నిజం. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో అభ్యర్థులు తమ ఆస్తిపాస్తుల వివరాలను పేర్కొన్నారు. అందులో పేర్కొన్నదాని ప్రకారం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపురామ్మోహననాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శ్యాంసుందర శివాజీలకు సొంత కార్లులేవు.



అచ్చెన్న ఆస్తి రూ. 1.74 కోట్లు

టెక్కలి టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థిర, చరాస్థుల విలువ మొత్తం 1,74,35,738 రూపాయలు కాగా, అతని భార్య విజయమాధవి పేరున  కోటి 36 వేల 248 రూపాయలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు చరాస్థులు రూ. 69,35,738,  స్థిరాస్థులు రూ. 1,05,00000 చూపారు. అచ్చెన్న చేతిలో రూ.81 వేలు, 13,39,414 రూపాయల విలువగల టాటా సఫారీ వాహనం, రూ. 6 లక్షల విలువైన 200 గ్రాముల బంగారం ఉన్నట్టు చూపారు.

2009 ఎన్నికల్లో

 అచ్చెన్నాయుడు 2009లో తన నామినేషన్ పత్రాలతో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు పరిశీలిస్తే... మొత్తం ఆస్తుల విలువ 87,13,555 రూపాయలు కాగా, వీటిలో చరాస్థులు రూ. 24,68,048,  స్థిరాస్థులు 12,74,740 రూపాయలుగా చూపారు.                           - న్యూస్‌లైన్,టెక్కలి



సీతారాం ఆస్తులు..

ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాం అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

 చేతిలో ఉన్న నగదు రూ. 2,45,298,  బ్యాంకులో రూ. 5,07,124, బంగారం 10 గ్రాములు మార్కెట్ విలువ రూ. 26 వేలు, టాటా సఫారీ వాహనం విలువ రూ. 9,27,450, స్థిరాస్తులు వంశపారం పర్యంగా సక్రమించింది 8.57 ఎకరాలు, స్వంతంగా కొనుగోలు చేసినది 4.77 ఎకరాలు.. వీటి మార్కెట్ విలువ రూ. 46,72,000, సొంత ఇల్లు ప్రస్తుత ధర రూ. 25 లక్షలు, చరాస్తులు రూ. 17,05,870, రుణాలు 10 లక్షల రూపాయలు ఉన్నట్టు చూపారు.



బొడ్డేపల్లి సత్యవతి ...



చేతిలో ఉన్న నగదు రూ. 3,92,804, బ్యాంకులో రూ. 14,58,191, ఫిక్సిడ్ డిపాజిట్ రూ. 1,71,115, ఎల్‌ఐసీలు రూ. 3 లక్షలు, తల్లిదండ్రులు ఇచ్చిన బంగారం 120 తులాలు, మార్కెట్ విలువ రూ. 35 లక్షలు ,స్వంతంగా కొనుగోలు చేసింది 18 తులాలు విలువరూ. 4 లక్షల 74 వేలు, కొడుకు గిఫ్ట్‌గా మహేంద్ర స్కార్పియో విలువ రూ. 3 లక్షలు, స్థిరాస్తులు విశాఖలో మార్కెట్ విలువ రూ. 10 లక్షలు, పరదేశీపాలెంలో రూ. 12 లక్షలు విలువ చేసిన నివాసగృహం, చరాస్తులు   81,56,114 రూపాయలుగా చూపారు.

న్యూస్‌లైన్, ఆమదాలవలస/రూరల్



గుండ లక్ష్మీదేవి...

శ్రీకాకుళం కలెక్టరేట్ :శ్రీకాకుళం శాసనసభా నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ భార్య గుండ లక్ష్మీదేవి ఆస్తులను ఆమె బుధవారం వెల్లడించారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో అందజేశారు.

చరాస్తులులక్ష్మీ దేవి చేతిలో ఉన్న నగదు: రూ. 50 వేలు కాగా తన భర్త పేరిట రూ. 70 వేలు ఉన్నట్లు తెలియజేశారు.

 ఆమె పేరిట బ్యాంకు డిపాజిట్లు, ఫైనాన్స్‌లు కలిపి యాక్సిక్ బ్యాంకు, సిండికెట్ బ్యాంకు, ఎస్‌బీఐ, ఏపీజీవీబీల్లో రూ. 65 వేలు ఉండగా,   భర్త పేరిట స్టేట్ బ్యాంక్‌ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 1.14 లక్షలు ఉన్నట్లు తెలిపారు.



 వివిధ సంస్థల్లో పెట్టుబడులు 12 వేలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇన్సూరెన్సు, పొదుపు రూ. 90 వేలు ఉన్నాయి.

లక్ష్మీదేవి పేరిట రూ. 4.8 లక్షలు విలువ చేసే టాటా ఇండికా కారు, రూ. 5.5 లక్షలు విలువ చేసే మహేంద్రా ట్రాక్టర్ ఉన్నట్లు తెలిపారు. తన భర్త పేరిట రూ. 7.22 లక్షలు విలువ చేసే మహేంద్రా స్కార్పియో ఉన్నట్లు తెలిపారు.



ఆభరణాలు:

తన పేరిట రూ.7.25 లక్షల విలువ గల   250 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.  వెండి ఆభరణాలు రూ. 53 వేలు ఉన్నట్లు తెలిపారు. భర్త పేరిట 50 గ్రాముల బంగారం, వెండి కలిపి రూ. 1.65 లక్షలు విలువ చేసే ఆభరణాలు ఉన్నట్లు వివరించారు.  మొత్తం చరాస్తులు ఆమె పేరిట రూ. 20.17 లక్షలకు గాను ఆమె భర్త పేరిట రూ. 10.78 లక్షలకు గాను చూపించారు.



స్థిరాస్తులు:

గొంటి, అరసవల్లి, తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ. 57.7 లక్షలు స్థిరస్తులు ఉన్నాయి. భర్త పేరిట వివిధ ప్రాంతాల్లో రూ. 1.68 కోట్లు స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.

సొంత కారు లేని రామ్మోహన్ నాయుడు

కలెక్టరేట్, న్యూస్‌లైన్:సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్ధిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు బుధవారం వెల్లడించారు. తనకు స్వంత కారు కూడా లేదని పేర్కొన్నారు.



చరాస్తులు

చేతిలో ఉన్న నగదు రూ.99వేలు తనది కాగా డిపెండెంట్ రూ.1.26 లక్షలుగా పేర్కొన్నారు. బ్యాంకు డిపాజిట్స్ (14 బ్యాంకులు) రూ.4.97 కోట్లు నిల్వలు ఉన్నాయి. డిపెండెంట్ పేరిట రూ.23.65 లక్షలు చూపించారు. వివిధ కంపెనీల్లోనూ మ్యూచువల్ ఫండ్స్ డిపాజిట్లు లేవు. ఎల్‌ఐసీ పాలసీలు మాత్రం ఉన్నట్లు చూపించారు. మూడు రకాల పాలసీలు మొత్తం రూ.4లక్షలు వరకూ ప్రీమియం చెల్లింపులు చేస్తున్నారు. డిపెండెంట్ పేరిట రూ.3లక్షల 80 వేలు ప్రీమియంలు చెల్లిస్తున్నారు.  బంగారు ఆభరణాలు 420 గ్రాములు ఉండగా దీని విలువ రూ.12.50 లక్షలుగా చూపించారు. డిపెండెంట్ పేరున 1200 గ్రాములు ఉండగా దీని విలువ రూ.36 లక్షలుగా పేర్కొన్నారు.



స్థిరాస్తులు

నిమ్మాడలో వారసత్వంగా వచ్చిన ఆస్థిలో ఐదవ వంతు, చిట్టివలసలోనూ, పెద్దబమ్మిడి, హెచ్.సి.పురం గ్రామంలో, నర్సింగపల్లి గ్రామం, డీఎల్ పురంగ్రామంలో, చాపురం, పాత్రునివలస, వెదురువాడ ల్లో గల భూములు సుమారుగా రూ.2.25కోట్లు విలువ గల భూముల్లో ఐదు భాగాల్లో ఒక భాగం తనకు ఉన్నట్లు తెలిపారు. అలాగే డిపెండెంట్ కూడా రూ.2.33కోట్ల విలువ చేసే భూములు ఉన్నట్లు పేర్కొన్నారు.



వ్యవసాయ భూములే ‘వజ్జ’కు ఎక్కువ

పలాస వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వజ్జ బాబూరావు పేరుతో  రూ.37,97,038 విలువ గల చరాస్థి ఉండగా, ఆయన భార్య గంగాభవానీ పేరుతో   రూ.42,30,953ల విలువ గల చరాస్థి ఉంది.

ఆయన పేరుతో  రూ.41,81,624 గల వ్యవసాయ భూములు ఉండగా, భార్య పేరున: రూ.14,64,615 భూములు ఉన్నాయి.  రూ.15 లక్షల విలువ గల వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఆయన పేరుతో రూ.30 లక్షల విలువైన ఇళ్లు, భవనాలు, ఆమె పేరుతో రూ.40.50 లక్షల విలువైన భవనం ఉంది. ఆయన పేరుతో మొత్తం రూ.86,81,624లు ఆస్తి ఉండగా, ఆమె పేరుతో   రూ.57,14,000 విలువ గల ఆస్తి ఉంది.  

వజ్జ బాబూరావుకు రూ.10,72,000, భార్య పేరున: రూ.23,82,000 అప్పులు ఉన్నాయి.                  - న్యూస్‌లైన్, పలాస



కళా వెంకటరావు కోటీశ్వరుడు

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్:ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కిమిడి కళావెంకటరావు రిటర్నింగ్ అధికారికి అస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పొందుపరిచిన ఆస్తుల వివరాలిలా ఉన్నాయి.

 కళా పేరున రూ.1.78 కోట్లు విలువైన భూములు, భార్య చంద్రమౌళి పేరున రూ. 91.48 లక్షలు విలువైన భూములున్నాయి.

 కళా వద్ద చేతి ఖర్చుల కోసం రూ.50 వేలు, భార్య దగ్గర రూ.40 వేలు, కుమార్తె యశస్వని వద్ద రూ. 10 వేలు ఉన్నట్టు చూపారు.

 ఇళ్లు, బంగారం, బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లు వంటివి కళా పేరుపై రూ.1.40 కోట్లు ఉండగా, భార్య పేరుపై రూ.71.16 లక్షలు స్థిరాస్తులు, కుమార్తె పేరుపై రూ. 9.10 లక్షలు ఉన్నాయి. కుమారుడు స్వతంత్రంగా బతుకుతున్నట్లు చూపారు.

కళాకు సంబంధించిన 1.78 కోట్లు ఆస్తుల్లో 1.39 కోట్లు స్వార్జితం కాగా మిగతావి వారసత్వం ద్వారా లభించినట్లు చూపారు.

 తన భార్యకు సంబంధించి రూ. 91.45 లక్షల్లో 64.4 లక్షలు స్వార్జితం, మిగతా అస్తి వారసత్వం ద్వారా వచ్చినట్లు చూపారు.

 కుమార్తెకు సంబంధించిన రూ. 24 లక్షలు స్థిరాస్థిలో రూ. 19 లక్షలు స్వార్జితం, మిగతాది వారసత్వం ద్వారా వచ్చినట్లు పొందుపరిచారు.

ఇంటికి సంబంధించి రూ.83 లక్షలు, వాహనానికి రూ. 7.73 లక్షలు అప్పు ఉన్నట్టు చూపారు.

 హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయని, అవి ప్రభుత్వ విలువ బట్టి వెలకట్టినట్లు పొందుపరిచారు.

గొర్లె కిరణ్‌కుమార్ ...



ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు..

 తన వద్ద చేతి ఖర్చుల కోసం రూ.1.10 లక్షలు, భార్య పరిమల వద్ద రూ.30 వేలు ఉన్నట్టు చూపారు.

 బ్యాంకుల్లో బంగారం, ఫిక్సిడ్ డిపాజిట్లు వంటివి తనపేరున రూ.13.16 లక్షలు, భార్య వద్ద రూ.17.31 లక్షలు, కుమారుడు తమన్ పేరున రూ.90 వేలు ఉన్నట్లు చెప్పారు.

 రూ. 1.30 కోట్లు విలువైన 35 ఎకరాల సాగు భూమి ఉన్నట్లు చూపారు.



కారు లేని శివాజీ

మాజీ మంత్రి, టీడీపీ పలాస అసెంబ్లీ అభ్యర్థి గౌతు శ్యాంసుందర శివాజీ పేరుతో సొంత కారు కూడా లేదు. పలాస ఎన్నికల అధికారికి తెలుగుదేశం అభ్యర్థి గౌతు శ్యాంసుందర శివాజీ తన నామినేషన్ పత్రంలో ఈ విషయం పేర్కొన్నారు. చరాస్తులు ఆయన పేరుతో  రూ.3,07,30,032.92, భార్య విజయలక్ష్మి పేరుతో రూ.57,77,838.54  ఉన్నాయి. శివాజీ పేరుతో  రూ.17,57,15,300, భార్య పేరుతో రూ.5,42,65,000 విలువ గల స్థిరాస్తులు, శివాజీ వద్ద  స్థిరాస్తుల అభివృద్ధికి రూ.15లక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ’ శివాజీ పేరుతో రూ.4,44,78,250లు, భార్య పేరుతో   రూ.2,64,33,563లు అప్పులు ఉన్నాయి.

ఆయన చేతిలో  రూ.15,51,628లు నగదు ఉంది. భార్య పేరుతో రూ.7,05,584.25లు

శివాజీ పేరుతో రూ.28,88,119.92, భార్య పేరుతో  రూ.41,30,613.29లు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి.

శివాజీ పేరుతో పోస్టల్‌లో ఎన్‌ఎస్‌ఎస్ బాండ్లు: రూ.11 లక్షలు ఉన్నాయి.

శివాజీ పేరుతో 30 గ్రాములు బంగారు ఆభరణాలు, భార్య పేరుతో 200 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నాయి.

శివాజీ పేరుతో కారు లేదు. ఆయన భార్య పేరుతో రూ.2,39,141 విలువ గల ఫోర్డ్ పిజియో కారు ఉంది.  - న్యూస్‌లైన్, పలాస

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top