హీరోనన్నారు.. జీరో అయ్యూరు

హీరోనన్నారు.. జీరో అయ్యూరు - Sakshi

 భీమవరం, న్యూస్‌లైన్ :కనుమూరి రఘురామకృష్ణంరా జు.. ఆయనో పారిశ్రామికవేత్త. ఉన్నట్టుండి రాజకీయూల్లోకి దిగారు. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనక చంద్రబాబు నాయుడితో జతకట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ పార్టీలో ఆయన పప్పులు ఉడకలేదు. ఆ వెంటనే టీడీపీ కోటరీ సూచన మేరకు బీజేపీలోకి జంప్ అయ్యూరు. కొత్తగా చేరినా.. రాజకీయూల్లో తానే రారాజు అన్నట్టుగా రాజకీయూలు నడిపారు. నరసాపురం పార్లమెంటరీ స్థానానికి బీజేపీ, టీడీపీ తరఫున నామినేషన్లు సైతం వేశారు. మొత్తానికి డెల్టా రాజకీయూల్లో హీరోగా మారి చక్రం తిప్పుదామనుకున్నారు. చివరకు జీరోగా మిగిలారు. 

 

 ఏ సీటొచ్చినా ఫర్వాలేదనుకుని...

 టీడీపీ అధినేత చంద్రబాబుతో జతకట్టిన రఘురామకృష్ణంరాజు బీజేపీ సీటు కోసం చివరివరకూ ప్రయత్నించారు. ఫలించకపోవడంతో బీజేపీతో టీడీపీ పొత్తు తెగతెంపులయ్యేలా ప్రయత్నాలు చేశారు. అదే జరిగితే టీడీపీ తరఫున రంగంలోకి దిగుదామనే ఉద్దేశంతో ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేశారు. తన కృషి ఫలిస్తుందనుకుంటున్న సమయంలో టీడీపీ, బీజేపీ మధ్య గాడితప్పిన పొత్తు తిరిగి పట్టాలెక్కింది. దీంతో చివరకు సీటు రేసులో ఓడిపోయారు. ఆర్థిక బలంతో ప్రజల్ని, రాజకీయాలను శాసిద్ధామనుకున్న రాఘురామకృష్ణంరాజుకు అటు టీడీపీలోను, ఇటు బీజేపీలోను సీటు దక్కక పోవటంతో రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. 

 

 వైఎస్సార్ సీపీలో ఉన్నప్పుడు...

 రఘురామకృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఏ మూలకు వెళ్లినా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఆదరించేవారు. ప్రతిచోట ప్రజాభిమానం మెండుగా కనిపించేది. అలాంటి నేత చివరకు బీజేపీలో చేరి తన రాజకీయ జీవితానికి తానే చరమగీతం పాడుకున్నారు. చంద్రబాబు అండ చూసుకుని రెండు పడవలపై కాలేసిన చందంగా టీడీపీ, బీజేపీలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. అరుుతే, ఆ రెండు పార్టీల్లోని నేతలకు రఘురామకృష్ణంరాజు విధానాలు మింగుడుపడలేదు. నరసాపురం బీజేపీ సీటు తనదేనంటూ.. ఉగాదికి ముందునుంచే ఓటర్లకు చీరలు, ఇతర తారుులాలతో ప్రలోభాల వల వేసే ప్రయత్నం చేశారు.

 

 చివరకు మరో పారిశ్రామికవేత్త, రఘురామకృష్ణంరాజుకు వరుసకు మేనమామ అరుున గోకరాజు గంగరాజు బీజేపీ సీటును తన్నుకుపోయారు. దీంతో ఉలిక్కిపడ్డ రఘురామరాజు చంద్రబాబు అండతో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. అరుునా బీజేపీ కేంద్ర నాయకత్వం దిగిరాలేదు. చేసేదేమీ లేకపోవడంతో భీమవరంలో బిచాణా ఎత్తేసేందుకు రఘురామకృష్ణంరాజు సిద్ధపడ్డారు. 

 టీడీపీ కండువా వేసుకోకపోయినప్పటికీ ఆ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడంతో 3 నెలల్లో 3 పార్టీలు మార్చిన నేతగా ఖ్యాతి గడించారు. సీటు దక్కక నిరాశలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు ఆయన అనుచరులు, బీజేపీ నేతలు ‘రాం.. రాం.. రఘురాం’ అంటూ ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. దీంతో రాజకీయూల్లో రారాజుగా అడుగుపెట్టిన రఘురామకృష్ణంరాజు చివరకు తీవ్ర నిరాశ, నిస్పృహలతో వెనుదిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

 చివరకు ఏమంటున్నారంటే...

 నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిత్వం కోసం పోటీపడి ఓడిపోయూనని ఆ పార్టీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. శనివారం భీమవరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు సీటు రాకుండా బీజేపీలో కొన్ని శక్తులు అడ్డుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ, గెలుపు గుర్రాలకు సీట్లు ఇవ్వలేదన్నారు. తాను పోటీలో లేకపోయినా టీడీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానన్నారు. బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి గోకరాజు గంగరాజు కోరితే ఎన్నికల్లో ఆయనకు సహకరిస్తానన్నారు. బీజేపీలోనే కొనసాగుతానని, టీడీపీ, బీజేపీ తరఫున వేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటానని చెప్పారు.

 
Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top