నామినేషన్ల పర్వానికి తెర

నామినేషన్ల పర్వానికి తెర - Sakshi


 అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ :సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం శనివారం ముగిసింది. చివరిరోజు భారీ సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు 23 మంది అభ్యర్థులు 34 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పార్లమెంటుకు 14 మంది, నరసరావుపేటకు 9 మంది నామినేషన్లు వేశారు. వీరిలో ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. గుంటూరు పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ అబ్దుల్ వహీద్, నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి  డాక్టర్ కె.వెంకటేశ్వరరావులు నామినేషన్ వేశారు. 17 అసెంబ్లీ స్థానాల్లో 217 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో 106 మంది ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి గుంటూరు, నరసరావుపేట పార్లమెంటు స్థానాలకు మొత్తం 38 మంది నామినేషన్లు దాఖలు చేయగా అసెంబ్లీ నియోజకవర్గాలకు  మొత్తం 362 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 21న నామినేషన్ల పరిశీలన అనంతరం బరిలో ఎంతమంది ఉంటారో.. ఎంతమంది పోటీ నుంచి తప్పుకుంటారో 23న స్పష్టత రానుంది.

 

 గుంటూరు పార్లమెంటు బరిలో వైఎస్సార్‌సీపీ తరుపున వల్లభనేని బాలశౌరి, టీడీపీ తరపున గల్లా జయదేవ్, కాంగ్రెస్‌పార్టీ తరపున షేక్ అబ్ధుల్ వహీద్‌లతో పాటు టీడీపీ రెబల్ అభ్యర్థిగా బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్ బరిలో ఉన్నారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు బరిలో వైఎస్సార్‌సీపీ తరుపున ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, టీడీపీ తరపున రాయపాటి సాంబశివరాావు, కాంగ్రెస్ పార్టీ తరపున డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వర్లు బరిలో నిలిచారు. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం బరిలో లేళ్ల అప్పిరెడ్డి(వైఎస్సార్‌సీపీ), మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి(టీడీపీ), కన్నా లక్ష్మీనారాయణ(కాంగ్రెస్) బరిలో ఉన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచిమొహమ్మద్ ముస్తఫా(వైఎస్సార్‌సీపీ), మద్దాళి గిరిధర్(టీడీపీ), షేక్ మస్తాన్‌వలి(కాంగ్రెస్), ప్రత్తిపాడు నియోజకవర్గానికి మేకతోటి సుచరిత(వైఎస్సార్‌సీపీ), రావెల కిషోర్(టీడీపీ), కొరివి వినయ్‌కుమార్(కాంగ్రెస్), తాడికొండ నియోజకవర్గం నుంచి క్రిస్టినా(వైఎస్సార్‌సీపీ), శ్రావణ్‌కుమార్(టీడీపీ), డాక్టర్ కిషోర్(కాంగ్రెస్), సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు(వైఎస్సార్‌సీపీ), కోడెల శివప్రసాద్(టీడీపీ),

 

 యర్రం వెంకటేశ్వరరెడ్డి(కాంగ్రెస్), గురజాల నియోజకవర్గం నుంచి జంగా కృష్ణమూర్తి(వైఎస్సార్‌సీపీ), యరపతినేని శ్రీనివాసరావు(టీడీపీ), ఆనం సంజీవరెడ్డి(కాంగ్రెస్), మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(వైఎస్సార్‌సీపీ), రామిశెట్టి నరేంద్ర(కాంగ్రెస్), కె.చలమారెడ్డి(టీడీపీ), పెదకూరపాడు నియోజకవర్గం నుంచి బొల్లా బ్రహ్మనాయుడు(వైఎస్సార్‌సీపీ), కొమ్మాలపాటి శ్రీధర్(టీడీపీ), పక్కాల సూరిబాబు(కాంగ్రెస్), నరసరావుపేట నియోజకవర్గంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(వైఎస్సార్‌సీపీ), నల్లబోతు వెంకట్రావు(బీజేపీ), అలగ్జాండర్(కాంగ్రెస్), చిలకలూరిపేట నుంచిమర్రి రాజశేఖర్(వైఎస్సార్‌సీపీ), ప్రత్తిపాటి పుల్లారావు(టీడీపీ), ఎం.హనుమంతరావు(కాంగ్రెస్), వినుకొండ నియోజకవర్గం నుంచి నన్నపనేని సుధ(వైఎస్సార్‌సీపీ), జి.వి.ఆంజనేయులు(టీడీపీ), మక్కెన మల్లికార్జునరావు(కాంగ్రెస్), రేపల్లె నియోజకవర్గంలో మోపిదేవి వెంకటరమణ(వైఎస్సార్‌సీపీ), అనగాని సత్యప్రసాద్(టీడీపీ), మోపిదేవి శ్రీనివాసరావు(కాంగ్రెస్), బాపట్ల నియోజకవర్గంలో కోన రఘుపతి(వైఎస్సార్‌సీపీ), అన్నం సతీష్‌ప్రభాకర్(టీడీపీ), చేజర్ల నారాయణరెడ్డి(కాంగ్రెస్), తెనాలి నియోజకవర్గంలో అన్నాబత్తుని శివకుమార్(వైఎస్సార్‌సీపీ), ఆలపాటి రాజేంద్రప్రసాద్(టీడీపీ), నాదెండ్ల మనోహర్(కాంగ్రెస్), పొన్నూరు నియోజకవర్గంలో రావి వెంకటరమణ(వైఎస్సార్‌సీపీ), ధూళిపాళ్ల నరేంద్రకుమార్(టీడీపీ), తాళ్ల వెంకటేష్‌యాదవ్(కాంగ్రెస్), మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి(వైఎస్సార్‌సీపీ), గంజి చిరంజీవి(టీడీపీ), మర్రెడ్డి రామకృష్ణారెడ్డి(కాంగ్రెస్), జి.వి.రాఘవులు(సీపీఎం) పోటీలో ఉన్నారు.

 

 రెబల్స్‌గా టీడీపీ అభ్యర్థులు.. టీడీపీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంది. చాలా మంది రెబల్స్‌గా బరిలో దిగారు. నరసరావుపేట నుంచి వేల్పుల సింహాద్రియాదవ్, పి వెంకటరామిరెడ్డి, వల్లెపు నాగేశ్వరరావు, గుంటూరు ఈస్ట్ నుంచి బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, మాచర్ల నుంచి చిరుమామిళ్ల మధు, జూలకంటి శ్రీనివాసరెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి, మానుకొండ సాంబిరెడ్డి, గుంటూరు వెస్ట్ నుంచి మిన్నెకంటి జయశ్రీ, మంగళగిరి నుంచి అంకా వరప్రసాద్, ప్రత్తిపాడు నంచి కందుకూరి వీరయ్య, సత్తెనపల్లి నుంచి నిమ్మకాయల రాజనారాయణలు బరిలో ఉన్నారు.

 

 బాపట్లలో అమృతపాణి నామినేషన్..

 ఒంగోలు టౌన్: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ తరఫున డాక్టర్ వరికూటి అమృతపాణి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఒంగోలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ కె.యాకూబ్‌నాయక్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో పార్టీ ప్రకటించిన హామీలు నెరవేర్చడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాన ని చెప్పారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top